Air India privatization : మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణ పూర్తి : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.

Air India Privatization
privatization of Air India : మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా సుమారు రూ.60 వేల కోట్ల నష్టంలో ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాల నిలిపివేత ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ప‌్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా.. వాటిల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం క్రుతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. నష్టాలు, రుణాల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరించాలని కేంద్రం విధానాన్ని ఖరారు చేసినా కరోనా మహమ్మారి వల్ల ఆచరణకు నోచుకోలేదు.
మహారాజాగా పేరొందిన ఎయిర్ ఇండియాతోపాటు లాభాల్లో ఉన్న కేంద్ర చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యూహానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది.