New Scheme for Poor Prisoners : పేద ఖైదీల కోసం కేంద్రం కొత్త పథకం .. హోంశాఖ ప్రకటన

పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

New Scheme for Poor Prisoners : పేద ఖైదీల కోసం కేంద్రం కొత్త పథకం .. హోంశాఖ ప్రకటన

New Scheme for Poor Prisoners

Updated On : April 7, 2023 / 5:39 PM IST

New Scheme for Poor Prisoners : పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తోంది. ఖైదీల కోసం పథకమా? అని ఆశ్చర్యపోవచ్చు. జరిమానాలు కట్టలేక, బెయిల్ ఫీజులు కట్టలేక జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీల కోసం కేంద్ర హోమ్ శాఖ కొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ‘పేద ఖైదీలకు ఆసరా’అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించామని శుక్రవారం (ఏప్రిల్ 7,2023 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

నేరాలు నిరూపించబడితన తరువాత కోర్టు విధించిన జరిమానాలను కట్టలేని, బెయిల్ ఫీజును కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని..సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని తెలిపింది. అటువంటి పేద ఖైదీల కోసం ఈ పథకం సహాయంగా ఉంటుందని వెల్లడించింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభమవుతుంది తెలిపింది.

దీనిపై హోం మంత్రిత్వ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంతో జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ సమస్యలను పరిష్కరించటానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోందని తెలిపింది.