Geetagiri Maharaj : మట్టి, బూడిద పూసుకుని తపస్సు.. కరోనా నుంచి విముక్తి కోసం!
రోనా అంతరించిపోవాలని ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాధువు కరోనా నుంచి ఈ లోకానికి విముక్తి కలగాలని తపస్సు ప్రారంభించారు.

Up Agra Monk Geetagiri Maharaj Pray On For End Of Corona Virus
Geetagiri Maharaj Tapas for corona end : కరోనా అంతరించిపోవాలని ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాధువు కరోనా నుంచి ఈ లోకానికి విముక్తి కలగాలని తపస్సు ప్రారంభించారు. యూపీలోని ఆగ్రా పరిధిలోని సరైంది గ్రామంలో వన్‌ఖండి అనే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గీతాగిరి మహరాజ్ లోక సంక్షేమాన్ని కోరుతూ మే 31 నుంచి కఠోర దీక్ష చేపట్టారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా ఒంటికి మట్టి, విభూది పూసుకుని ఏకాగ్రతతో తపస్సు కొనసాగిస్తున్నారు గీతాగిరి మహరాజ్. మన భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కలగాలని కోరుతూ..మా గురువుగారు ఘోర తపస్సు ఆచరిస్తున్నారని గితాగిరి మహారాజ్ శిష్యుడు గణనేంద్ సరస్వతి మహారాజ్ తెలిపారు.
ఆశ్రమంలో కరోనా నిబంధనలను కూడా పాటిస్తున్నామని స్పష్టంచేశారు. మా ఆశ్రమంలో మా గురువుగారు గీతాగిరి మహారాజ్‌తో పాటు మరో నలుగురు సాధువులు మాత్రమే ఉంటున్నామని వెల్లడించారు. గురువుగారు గీతాగిరి మహారాజ్‌ను దర్శించుకోవటానికి శిష్యులు కూడా పరిమిత సంఖ్యలోనే వస్తున్నారనీ..అలా కోవిడ్ నిబంధలను పాటిస్తున్నామని తెలిపారు.
గురువుగారిని దర్శించుకోవటానికి ప్రతీరోజు మహిళలు, చిన్నారులు కూడా వస్తుంటారని కానీ ఈ కరోనా కారణంగా దర్శనాలకు పరిమితం చేశారని తెలిపారు. గురువుగారు లోకానికి ఏ విపత్తు సంభవించినా తపస్సు చేస్తుంటారని అలా ఇది ఐదవసారి తపస్సులో కూర్చున్నారని తెలిపారు. కాగా ఆగ్రాలో కరోనా కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.