Cm Yogi Adityanath : సీఎం యోగీ దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దీపావళి పండుగకు మహిళలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకను ప్రకటించారు.

Cm Yogi Adityanath Diwali gift
Cm Yogi Adityanath Diwali gift : యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దీపావళి పండుగకు మహిళలకు శుభవార్త చెప్పారు. బులంద్‌షహర్ లో రూ.632 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం యోగీ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సందర్భంగా దీపావళి కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని మంగళవారం (అక్టోబర్ 17,2023)న ప్రకటించారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి దీపావళి పండుగకు ఉచితంగా సిలిండర్ఇస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
ఈ సందర్భంగా సీఎం యోగీ మాట్లాడుతు..2014లో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లను పొందాలంటే ఓ సవాల్ గా ఉండేదని పేర్కొన్నారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికి సిలిండర్ ధరను రూ.300 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీపావళి పండుగ కానుకగా ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు.
Uttar pradesh : రూ.200ల కోట్లు ఎకౌంట్లో పడ్డాయని లబోదిబోమన్న కూలి .. పోలీసులకు ఫిర్యాదు
అలాగే బీజేపీ చేసే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో యూపీలో 55లక్షలమందికి మహిళలు ఇంటి యజమానులుగా మారారు అని స్వచ్ఛ భారత్ ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.75లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలు చేశామని వెల్లడించారు. కాగా..కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ ఉజ్వల యోన అనేది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు (BPL) LPG కనెక్షన్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.