CM yogi adityanath : 28 ఏళ్లకు సొంతూరికొచ్చి..తల్లి ఆశీస్సులు తీసుకున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో ఏళ్ల తరువాత సొంత గ్రామానికి వచ్చారు. ఐదేళ్లకు తల్లి ఆశీస్సులో తీసుకున్నారు. అమ్మ పాదాలను నమస్కారం చేస్తున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Cm Yogi Adityanath Taken Blessings From Mother
CM yogi adityanath taken blessings from mother : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో ఏళ్ల తరువాత సొంత గ్రామానికి వచ్చారు. ఐదేళ్లకు తల్లి ఆశీస్సులో తీసుకున్నారు. అమ్మ పాదాలను నమస్కారం చేస్తున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధాని మోదీ తల్లికి ఎలా దూరంగా ఉంటున్నారో..సీఎం యోగీ కూడా సన్యాసం తీసుకున్ననాటినుంచి తల్లికి దూరంగా ఉంటున్నారు. కానీ సాధువైనా తల్లిమీద ఉన్న ప్రేమ పోదుగా..యోగీ అయినా రాజు అయినా తల్లికి బిడ్డే. అలాగే సీఎం యోగీ కూడా. సీఎం యోగీ ఆదిత్యానాథ్ తల్లిని కలిసిన క్రమంలో ఆమె పాదాలకు నమస్కరించారు. దీంతో ఆ మాతృమూర్తి హృదయం ఉప్పొంగిపోయింది. ఇన్నాళ్టికి బిడ్డ కనిపించాడనే ఆనందం ఆమె మొహంలో కనిపించింది. చిరునవ్వులు నవ్వుతూ కొడుకుని మనసారా దీవించారు. అమ్మ దీవెనలతో యోగి కూడా ఆనందంతో పొంగిపోయారు.
Also read : Cm KCR : తలసానికి కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా?దానికి కారణం అదేనా?
యూపీకి సీఎంఅయిన తర్వాత యోగీ తల్లిని కలవడం ఇదే తొలిసారి. దీంతో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగం ఉప్పొంగింది. అదే మని కన్నబంధం అంటే. ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్నారు సీఎం యోగీ. ఈ అరుదైన దృశ్యం మంగళవారం (మే 3,2022)ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో చోటు చేసుకుంది. పౌరీ జిల్లాలోని పంచూర్ సీఎం యోగి స్వగ్రామం. సుమారు 28 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆయన తన సొంతూరులో అడుగు పెట్టారు.
Also read : Chandra Babu Naidu : అధికారంలోకి రావటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న చంద్రబాబు
ఈ సందర్భంగా తల్లి పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. యోగి మేనల్లుడికి పుట్టు వెంట్రుకల వేడుక బుధవారం ఉండడంతో సొంతూరికి చేరుకున్నారు. ప్రధాని మోదీ మాదిరే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ లో కన్నతండ్రి అంత్యక్రియలకు కూడా సీఎం యోగి వెళ్లలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు అందరికీ తండ్రిగా కోవిడ్ నిబంధనల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తానే, వాటిని ఉల్లంఘిస్తే ఎలా? అంటూ సీఎం యోగీ విమర్శకులకు సమాధానం ఇచ్చారు.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022