Cm KCR : తలసానికి కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా?దానికి కారణం అదేనా?

మంత్రి తలసానికి KCR కు మధ్య గ్యాప్ పెరిగిందా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా?దానికి కారణం అదేనా?

Cm KCR : తలసానికి కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా?దానికి కారణం అదేనా?

Kcr Serious On Minister Talasani Srinivas Yadav..

Cm KCR : కేసీఆర్ కేబినెట్‌లో.. ఆయనో కీలక మంత్రి. సీఎంకు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడంలోనూ.. ఆయన ముందుంటారు. ఇక.. హైదరాబాద్‌ పరిధిలో ఎలాంటి ప్రోగ్రాం అయినా.. ఆయనకే బాధ్యతలు అప్పగించేవారు ముఖ్యమంత్రి. అలాంటి మినిస్టర్‌కి అధికార పార్టీలో కొత్త చిక్కులు ఎదురువుతున్నాయన్న చర్చ మొదలైంది. మొన్నటిదాకా.. ఆయనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినా.. ఇప్పుడు పెద్దాయన పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ మినిస్టర్ విషయంలో.. సడన్‌గా ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక రీజనేంటి?

హైద‌రాబాద్ రాజ‌కీయాల్లో తన మార్క్ చూపించిన మాస్ లీడర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్. టీడీపీ హయాంలోనూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఆయన కీలక నేతగా చలామణి అవుతున్నారు. అలాంటి తలసానికి.. ఈ మధ్య గులాబీ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే చర్చ మొదలైంది. ఇదే.. రాజకీయ వర్గాల్లో రకరకాల గుసగుసలకు కారణమైంది. ఈ మధ్యకాలంలో మంత్రి తలసాని వ్యవహారం.. గ్రేటర్ టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయ్. సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటారన్న పేరున్నా.. ఈ మధ్య సీఎం కూడా ఆయనకంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం మొదలైంది. ఇందుకు.. 2, 3 ఘటనలను కారణాలుగా చూపుతున్నారు.

Also read : Chandra Babu Naidu : అధికారంలోకి రావటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న చంద్రబాబు

సీఎం కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. స్టేట్ నుంచి సెంటర్ దాకా అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో.. సికింద్రాబాద్‌లో జ‌రిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో.. మంత్రి త‌ల‌సాని, గ‌వ‌ర్నర్ త‌మిళిసై ఒకే స‌మ‌యంలో పాల్గొన‌డం, గ‌వ‌ర్నర్‌కు.. తలసాని స‌న్మానం చేయ‌డం లాంటివి సీఎం దృష్టికి వెళ్లాయ్. గవర్నర్ వ్యవస్థ, కేంద్రం వైఖరిపై.. టీఆర్ఎస్ విరుచుకుపడుతున్న సమయంలో.. మంత్రి ఇలా వ్యవహరించడం.. సీఎం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అంతకుముందు జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ.. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే ప్రకాశ్ రాజ్ బరిలో ఉన్నా.. ఇన్‌డైరెక్ట్‌గా మంచు మనోజ్‌కు.. మంత్రి తలసాని మద్దతివ్వడం, ఎన్నికల్లో గెలుపు తర్వాత.. మంచు ఫ్యామిలీతో తలసాని భేటీ కావడంపైనా.. కేసీఆర్ గుర్రుగా ఉన్నారని పార్టీలో అంతా అనుకుంటున్నారు.

తాజాగా.. గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనయుడు సాయి కిరణ్‌ యాదవ్‌ను ప్రమోట్ చేసేందుకు.. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు.. తలసాని కార్పొరేటర్లతో రహస్య మీటింగ్ నిర్వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. వీటన్నింటికి సంబంధించి.. మంత్రిపై సీఎం కాస్త సీరియస్‌గానే ఉన్నారని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే జరిగిన ప్లీనరీలో.. మంత్రి తలసానికి.. కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయం స్పష్టమైంది. కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశాక.. తలసాని, ఆయన తనయుడు సాయి కిరణ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి.. సీఎంకు సన్మానం చేసేందుకు స్టేజీ మీదకొచ్చారు. శాలువా, మెమెంటోతో కేసీఆర్‌ ముందుకొచ్చినా.. ఆయన సున్నితంగా సన్మానాన్ని తిరస్కరించారు. దీంతో.. సాయి కిరణ్ వేదిక దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Also read : Tunnel Route In Hyderabad : KBR పార్క్ కింద 6.30 కి.మీటర్ల సొరంగ మార్గం నిర్మించే యోచనలో ప్రభుత్వం

ప్లీనరీ పూర్తయ్యే దాకా.. తలసాని స్టేజీ మీద శాలువాతోనే ఉన్నా.. కేసీఆర్ చాన్స్ ఇవ్వలేదు. తాజాగా.. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులోనూ.. తలసాని.. సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించినా.. పెద్దాయన పెద్దగా పట్టించుకోలేదు. మరి.. ఈ వ్యవహారం ఇంకెన్నాళ్లు కంటిన్యూ అవుతుంది.. ఎప్పటికి ముగుస్తుందన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.