UP : ప్రమాదవశాత్తూ పోలీస్ స్టేషన్ లోపల మహిళ తలపై కాల్పులు జరిపిన యూపీ పోలీస్

తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఇష్రత్ అనే మహిళను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

UP : ప్రమాదవశాత్తూ పోలీస్ స్టేషన్ లోపల మహిళ తలపై కాల్పులు జరిపిన యూపీ పోలీస్

up cop

UP Cop Accidentally Shoots Woman : ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసు ప్రమాదవశాత్తూ పోలీస్ స్టేషన్ లోపల మహిళ తలపై కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయారు. ఒక మహిళ తన పాస్‌పోర్ట్‌కు సంబంధించి వెరిఫికేషన్ కోసం పోలీసు స్టేషన్‌ కు వెళ్లారు. ఆమె పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి కొన్ని అంగుళాల దూరం నుంచి ప్రమాదవశాత్తు మహిళపై తలపై కాల్చాడు. బుల్లెట్ తాకడంతో ఆమె నేలపై కుప్పకూలిపోయారు. ఈ ఘటన అలీఘర్ లో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఇష్రత్ అనే మహిళను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం మధ్యాహ్నం మధ్యాహ్నం 2:50 గంటల ప్రాంతంలో జరిగింది. కాగా, నిందితుడైన పోలీసు అదృశ్యమయ్యాడు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ చేస్తున్న పోలీసు అధికారి డబ్బు కోసం మహిళను వేధిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Woman Molested : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి దారుణ హత్య

దీంతో వాగ్వాదం జరగడంతో ఆ అధికారి ఆమెను కాల్చిచంపాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాధిత మహిళ ఉమ్రా, మినీ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్ ఎంక్వైరీ కోసం ఆమె పోలీస్ స్టేషన్‌ను వెళ్లారని గాయపడిన మహిళ బంధువు జీషన్ తెలిపారు. అయితే డబ్బుల ఇవ్వాలని ఆమెకు కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఆమెను ఎవరు కాల్చారో, డబ్బులు డిమాండ్ చేశారో మాత్రం తెలియదన్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పారు.

పోలీసు లోపలికి వస్తూ అతని సహోద్యోగి చేతికి తుపాకీని ఇస్తున్నప్పుడు పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం సదరు మహిళ నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఆ మహిళపై కాల్పులు జరపడంతో ఆమె నేలపై కుప్పకూలినప్పుడు పోలీసు అధికారి తుపాకీని పరీక్షిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మను వెంటనే సస్పెండ్ చేసినట్లు అలీఘర్ ఎస్ఎస్ కళానిధి నైతాని తెలిపారు.

Fire Accident : ఇరాక్ సోరన్ యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గాయపడిన మహిళకు డాక్టర్ల బృందం చికిత్స చేస్తున్నారని వెల్లడించారు. సంఘటన ఫుటేజీని ఫీల్డ్ యూనిట్ దర్యాప్తు చేస్తోందని అని చెప్పారు. మహిళ తల వెనుక భాగంలో గాయమైందని అధికారి తెలిపారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. నిందితుడైన పోలీసుపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.