అదనపు కట్నం సమస్య అని వచ్చిన మహిళకు అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపించిన పోలీస్

అదనపు కట్నం సమస్య అని వచ్చిన మహిళకు అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపించిన పోలీస్

police-suspended

Updated On : August 19, 2020 / 9:55 AM IST

అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపించడం మొదలుపెట్టాడో సబ్-ఇన్‌స్పెక్టర్. ఎస్ఐపై ఆరోపణలు పై ఆఫీసర్లకు చేరడంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును మరో అధికారికి ట్రాన్సఫర్ చేశారు. మహిళకు ఎస్ఐ మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.



నిందితుడు అజయ్ ప్రకాశ్ సింగ్ అనే పోలీస్ అధికారి. బులంద్‌షార్. ఔట్ పోస్ట్ లో ఇన్ ఛార్జిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తర్వాతే ఎస్ఐ మహిళకు మెసేజ్ లు చేసినట్లు కన్ఫామ్ చేసుకున్నాం. అని బులంద్‌షార్ ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్.. అన్నారు.



అధికారికంగా కేసు నమోదు చేయనప్పటికీ పర్సనల్ రిసోర్సెస్ ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేశాం. నిందితుడైన పోలీసును సస్పెండ్ చేసి అతని స్థానంలో మరో ఆఫీసర్ ను నియమించాం. అతనిపై వేధింపుల కేసు పెట్టాం’ అని ఆయన వివరించారు.