BJP Leader : మాజీ మంత్రి, బీజేపీ నేత హత్య?

ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

BJP Leader : మాజీ మంత్రి, బీజేపీ నేత హత్య?

Bjp Leader

Updated On : September 10, 2021 / 3:26 PM IST

BJP Leader : బీజేపీ సీనియర్ నేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు. యూపీలోని బాగ్‌పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది. అయితే మెడకు టవల్ కట్టి ఉండటంతో ఎవరైనా హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో ఉన్న స్కార్పియో వాహనం మిస్ అవడంతో ఆయనది హత్యే అనే అనుమానానికి బలం చేకూరినట్లైంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆత్మారామ్‌ను టవల్‌తో గొంతుకు ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్‌పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే సమీప బంధువులే ఆత్మారామ్ ను హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా ఆత్మారామ్‌ 1997లో యూపీ మంత్రిగా పనిచేశారు. ఆత్మారామ్ అనుమానాస్పద మృతి విషయం తెలుసుకున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ విచారణ వేగవంతం చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని తెలిపారు.