Crorepati overnight: కూలీ బ్యాంకు ఖాతాలో రూ.221 కోట్లు.. గుండె గుభేలు
తానేమీ తప్పు చేయలేదని, కనీసం మంచి దుస్తులు కొనుక్కోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని, అయినప్పటికీ..

Crorepati overnight
Labourer: రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు ఓ కూలీ. కోట్లాది రూపాయలు వచ్చి అతడి బ్యాంకు ఖాతాలో పడ్డాయి. అయితే, ఈ విషయం గురించి అతడికి కనీసం తెలియలేదు. ఇప్పుడు ఆ డబ్బే అతడికి ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన శివప్రసాద్ నిషాద్ అనే వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆదాయ పన్ను శాఖ నుంచి తనకు నోటీసులు అందడంతో షాక్ అయ్యాడు.
తానేమీ తప్పు చేయలేదని, కనీసం మంచి దుస్తులు కొనుక్కోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని, అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావడం ఏంటని ఆందోళన చెందాడు. వెంటనే తన సొంత గ్రామానికి వచ్చి దీనిపపై పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
తన బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయలు ఉన్న విషయం కూడా తనకు నోటీసులు అందే వరకు తెలియదని అన్నాడు. తాను 2019లో పాన్ కార్డు పోగొట్టుకున్నానని, దాని సాయంతో తన పేరుతో ఎవరో బ్యాంకు ఖాతా తెరిచి ఉండొచ్చని శివప్రసాద్ అనుమానిస్తున్నాడు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. శివప్రసాద్ నిషాద్ పేరుపై అతడి బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.221 కోట్లు ఉన్నాయి.
Facts about Height : మీరు రాత్రి కంటే ఉదయం పొడవుగా ఉంటారు.. కావాలంటే కొలుచుకోండి..