Bin Laden: ‘ప్రపంచంలో ఉత్తమ జూనియర్ ఇంజనీర్’ అంటూ ‘బిన్ లాడెన్’ ఫోటో పెట్టుకున్న యూపీ విద్యుత్ అధికారి
దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్)లో సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ)గా పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే అధికారి..తన కార్యాలయంలో ఉగ్రవాది బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నాడు

Binladen
Bin Laden: నరరూప రాక్షసుడిగా చెప్పుకునే..అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్..ఎంతటి ఘోరాలకు పాల్పడింది ప్రపంచానికి తెలుసు. తన ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రపంచాన్ని గడగడలాడించిన బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం వెంటాడి వేటాడి మరీ చంపింది. కాగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ విద్యుత్ అధికారి..తన కార్యాలయంలో ఒసామా బిన్ లాడెన్ ఫోటో పెట్టుకోవడం తీవ్ర కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్)లో సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ)గా పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే అధికారి..తన కార్యాలయంలో ఉగ్రవాది బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
Other Stories: Malicious Extraterrestrial: భూమిపై దాడి చేయగల నాలుగు ప్రమాదకర గ్రహాంతర ఆవాసాలు పాలపుంతలో ఉన్నాయి
“ప్రపంచంలోని అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్” గా అభివర్ణిస్తూ, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని తన కార్యాలయంలో పెట్టుకున్నాడు రవీంద్ర ప్రకాశ్. దీనిపై సమాచారం అందుకున్న ఫరూఖాబాద్ జిల్లా విద్యుత్ ఉన్నతాధికారులు..విచారణకు ఆదేశించారు. ఎస్డీఓ రవీంద్ర ప్రకాశ్..తన కార్యాలయంలో నిజంగానే ఒసామా బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతనిపై కేసు నమోదు చేసారు.
Other Stories: Russia warns USA: యుక్రెయిన్‌కు హైటెక్ ఆయుధాల సరఫరా పై అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరిక
ఈ ఘటనపై విచారణ అనంతరం డీవీవీఎన్ఎల్ విద్యుత్ అధికారి రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ ను సస్పెండ్ చేసినట్లు ఫరూఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే స్పెండ్ అయిన విద్యుత్ అధికారి రవీంద్ర ప్రకాశ్ తన చర్యలను సమర్థించుకున్నారు. “ప్రపంచంలో ఎవరైనా ఎటువంటి విగ్రహాన్నయినా పెట్టుకోవచ్చని, ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్. ఈ ఫోటో కాకపోతే మరో ఫోటో నా వద్ద ఇంకా అనేక కాపీలు ఉన్నాయి” అంటూ చెప్పడం కొసమెరుపు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్‌ను 2 మే 2011లో అమెరికా సైనిక బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.