UP schools close : యూపీలో కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూళ్లన్నీ మూసివేత..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. యూపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్కూళ్లు మూసివేశారు.

Up Schools Close
UP schools close : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. యూపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్కూళ్లు మూసివేశారు.
మార్చి 31 వరకు ప్రాథమిక తరగతి నుంచి 8వ తరగతి వరకు నడిచే స్కూళ్లన్నీ మూసివేశారు. మార్చి 24 నుంచి మార్చి 31వరకు యూపీలో అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అన్ని ఇతర విద్యా సంస్థల్లో పరీక్షలు జరగని స్కూళ్లన్నీ మార్చి 25 నుంచి మార్చి 31 వరకు మూసివేయనున్నట్టు పేర్కొంది. కరోనాతో పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి సహా అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ప్రస్తుతం యూపీలో 3,036 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, 8,759 మంది కరోనాతో మరణించారు. అలాగే 5,95,743మంది కరోనా నుంచి కోలుకున్నారు.