First Vaccine for Chikungunya : చికున్‌గున్యా వైరస్‌కు ఫస్ట్ వ్యాక్సిన్…యూఎస్ ఆమోదం

ప్రపంచవ్యాప్తంగా ఇక చికున్ గున్యా జ్వరాల వ్యాప్తికి తెరపడనుంది. చికున్ గున్యా జ్వరాలు, తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఇక ఊరట లభించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికున్ గున్యా వైరస్ కు వ్యతిరేకంగా టీకాను ఆమోదించినట్లు అమెరికా ఆరోగ్య అధికారులు వెల్లడించారు....

First Vaccine for Chikungunya : చికున్‌గున్యా వైరస్‌కు ఫస్ట్ వ్యాక్సిన్…యూఎస్ ఆమోదం

First Vaccine for Chikungunya

first vaccine for chikungunya : ప్రపంచవ్యాప్తంగా ఇక చికున్ గున్యా జ్వరాల వ్యాప్తికి తెరపడనుంది. చికున్ గున్యా జ్వరాలు, తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఇక ఊరట లభించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికున్ గున్యా వైరస్ కు వ్యతిరేకంగా టీకాను ఆమోదించినట్లు అమెరికా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దోమల ద్వారా వ్యాపించే చికున్ గున్యా వైరస్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌కు యూఎస్ ఆరోగ్య అధికారులు పచ్చజెండా ఊపారు.

Also Read : Delhi Artificial Rain : ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు…నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు

ఐరోపాకు చెందిన వాల్నేవా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను లిక్స్‌చిక్ పేరుతో విక్రయించనున్నారు. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఈ టీకాను ఆమోదించినట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చికున్ గున్యా వైరస్ ప్రబలుతున్న దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువస్తాయని యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ తెలిపింది. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే చికున్‌గున్యా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ,ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది.

Also Read : Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు

చికున్‌గున్యా వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపించింది, దీనివల్ల ప్రపంచవ్యాప్త వ్యాధిగా పేరొందిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది, గత 15 సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా రోగులు ఈ చికున్ గున్యా బారిన పడ్డారు. ‘‘చికున్‌గున్యా వైరస్‌ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైన వ్యాధి. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది, ముఖ్యంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి’’అని సీనియర్ ఎఫ్‌డీఏ అధికారి పీటర్ మార్క్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : Boiled Egg Vs Omelette : ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది? ఇలా తెలుసుకోండి..

టీకా ఒక మోతాదులో ఇంజెక్ట్ చేయనున్నారు. ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే చికున్‌గున్యా వైరస్ కు ప్రత్యక్ష, బలహీనమైన వెర్షన్‌ ఉంది. ఉత్తర అమెరికాలో 3,500 మందిపై రెండు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం లాంటి సాధారణ దుష్ప్రభావాలు వెలుగుచూశాయి.