ఇస్రోకి రూ.8వేల కోట్ల జరిమానా

Isro’s Antrix to pay $1.2 bn to Devas 2005 నాటి శాటిలైట్ ఒప్పందం రద్దుకి సంబంధించి బెంగుళూరుకు చెందిన స్టార్టప్.. దేవాస్ మల్టీమీడియాకు 1.2బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొరేషన్ ను అమెరికా కోర్టు ఆదేశించింది. 2005లో… రెండు శాటిలైట్లు అభివృద్ధి చేసి..ప్రారంభం,ఆపరేట్ చేయడం మరియు 70 ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో సిగ్నల్ అందించే విధంగా దేవాస్ తో యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
కానీ ఆ ఒప్పందాన్ని 2011 ఫిబ్రవరిలో యాంత్రిక్స్ రద్దు చేసింది. దీంతో అప్పటినుంచి భారత్ లోని పలు కోర్టులను దేవాస్ కంపెనీ ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీంకోర్టుని కూడా ఆశ్రియంచిది దేవాస్ కంపెనీ. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.
అయితే, అమెరికాలోనూ ఈ కేసును వాదించే హక్కు ఉన్నట్లు తెలిసిన దేవాస్ మల్టీమీడియా…2018 సెప్టెంబర్ లో వాషింగ్టన్ లోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ లోని కోర్టులో పటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు పరిధి విషయంలో ఇష్యూస్ ని పేర్కొంటూ ఈ పిటిషన్ ను కొట్టివేయాలంటూ 2018 నవంబర్ లో యాంత్రిక్స్ యూఎస్ కోర్టుని కోరింది. ఈ నేపథ్యంలో దీనిపై ఏడాదిపాటు స్టే విధించిన కోర్టు.. ఏప్రిల్-15,2020లోగా యాంత్రిక్,దేవాస్ సంయుక్త స్టేటస్ రిపోర్ట్ ని ఫైల్ చేయాలని తెలిపింది.
జూలై 16, 2020 న, దేవాస్ మరియు యాంత్రిక్స్… ఒక ఉమ్మడి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారు. యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు అమెరికా అంతటా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ కేసుపై యుఎస్ కోర్టుకు అధికార పరిధి ఉందని దేవాస్ వాదించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27,2020న వాషింగ్టన్ జిల్లా కోర్టు జడ్జి థామస్ జెల్లీ ఈ కేసులో తీర్పు వెలువరించారు. దేవాస్ కు 562.5మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాలని, వడ్డీతో కలిపి మొత్తం నష్టపరిహారం 1.2బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ యాంత్రిక్స్ ను కోర్టు ఆదేశించింది.