Ram Lubhai College : కీచక ప్రొఫెసర్.. ఉమెన్స్ కాలేజీలో సెక్స్ రాకెట్.. డ్రగ్స్ దందా
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ఓ మహిళా కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరతీశాడు. విద్యార్థినులకు డ్రగ్స్ అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Ram Lubhai College
Ram Lubhai College : ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ఓ మహిళా కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరతీశాడు. విద్యార్థినులను లోబరుచుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ప్రొఫెసర్ బాగోతం బట్టబయలైంది. రాంలుభి సహాని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మ్యాధ్స్ ప్రొఫెసర్ కమ్రాన్ ఆలం ఖాన్.. విద్యార్థినులకు డ్రగ్స్ అలవాటు చేసి శారీరక సంబంధాలు కొనసాగించమని వారిపై ఒత్తిడి తెస్తున్న ఉదంతం కలకలం రేపింది.
చదవండి : Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు
ఓ విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఈ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొఫెషర్ విద్యార్ధినులను స్మోకింగ్, డ్రగ్స్ వాడేలా ప్రేరేపించేవాడని.. వాటితోపాటు అశ్లీల వీడియోలు, సెక్స్ టాయ్స్ ఇచ్చి లైంగిక సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి తెచ్చేవాడని ఆ కాలేజీలో బీఎస్సీ విద్యార్ధిని ఆరోపించింది.
చదవండి : BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే
కొంతమంది విద్యార్థినులను తన గుప్పిట్లో పెట్టుకొని ఈ విధమైన కీచక పర్వానికి తెరతీసాడని పేర్కొంది. విద్యార్థినులను తన ఇంటికి తీసుకెళ్లి కోరిక తీర్చాలని బెదిరిస్తాడని వాపోయింది. అతడి చేష్టలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని బెదిరించేవాడని.. కమ్రాన్ ఆలం ఖాన్ భార్య కూడా ఈ అరాచకానికి వత్తాసు పలుకుతుందని విద్యార్థిని తెలిపింది.
చదవండి : Minor Gang Raped : బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి నెల రోజులుగా గ్యాంగ్ రేప్
కళాశాలలో చాలామంది విద్యార్థినులు డ్రగ్స్‌కి బానిసయ్యారని, తల్లిదండ్రులకు తెలియకుండా స్మోకింగ్ చేస్తున్నారని తేలింది. ప్రొఫెసర్ తీరుపై సోదరుడితో కలిసి కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. నిందితుడు ప్రొఫెసర్ కమ్రాన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.