letter with blood : రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన కేదార్నాథ్ ఆలయ పూజారులు
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.

Kedarnath Priest Written A Letter With Blood To The President
kedarnath priest written a letter with blood to president : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు. దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామికి కూడా రక్తంతో లేఖలు రాశారు.కేదార్నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ కేదార్ నాథ్ దేవాలయంలోని ధమ్ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు..తీర్థపురోహిత్ సాకేత్ బగ్వాడీ,కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా సమక్షంలో ఆందోళన చేపట్టి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర సీఎంకు రక్తంతో లేఖలు రాసి తమ నిరసన తెలిపారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు పురోహితులు. ఇలాగే రక్తంతో లేఖలు రాశారు.
రెండు నెలలుగా..కేదార్నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. గత మంగళవారం నుంచి ఉపవాసంతోనే నినాదాలు చేస్తున్నారు. ఈ లేఖలో పురాణ కాలం నుండి కేదార్‌నాథ్‌లో యాత్రికుల అర్చకుల హక్కులకు సంబంధించిన అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడి సంప్రదాయాన్ని తారుమారు చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేస్తూ.. దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్స్ నెరవేర్చలా నిర్ణయం తీసుకోకపోతే..ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా, ఆచార్య సంతోష్ త్రివేది, కుబేర్‌నాథ్ పోస్తి, నితిన్ బగవాడి, ప్రదీప్ శర్మ, సవన్ బాగ్వాడి, ప్రకాశ్ చంద్ర తిన్సౌలా, రమాకాంత్ శర్మలతో పాటు పలువురు యాత్రికులు కూడా పాల్గొన్నారు.