Vaccine Testing Center : హైదరాబాద్‌లో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు
నెల రోజుల్లో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. పీఎం కేర్స్ నిధులతో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Vaccine Testing Center
Vaccine Testing Center : నెల రోజుల్లో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. పీఎం కేర్స్ నిధులతో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాలే ఉన్నాయని.. హైదరాబాద్ లో మూడో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. భాగ్యనగరం ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని, టెస్టింగ్ సెంటర్ రావడం నగరానికి తలమానికం అని తెలిపారు.
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గతుంది. ఈ రోజు 45 వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా చాలావరకు గట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. రోజుకు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు 34 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.