India Defence Production: రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డ్.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి

తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్తి విలువ 12 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది

India Defence Production: రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డ్.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి

Updated On : May 20, 2023 / 12:11 PM IST

India Defence : భారత రక్షణ రంగం కొత్తి మైలు రాయిని చేరుకుంది. రక్షణ రంగంలోని ఉత్పత్తి తొలిసారి లక్ష కోట్ల రూపాయల మార్కుని దాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఉత్పత్తుల విలువ లక్ష కోట్ల రూపాయలు దాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) ఇది 95 వేల కోట్ల రూపాయలుగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసినందుకు ముగ్గురిని ఉరి తీసిన ఇరాన్

తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్తి విలువ 12 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గత ఏడు-ఎనిమిదేళ్లలో పరిశ్రమలకు ప్రభుత్వం జారీ చేసిన రక్షణ లైసెన్సుల సంఖ్యలో దాదాపు 200 శాతం పెరుగుదల ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఇందుకు గాను వచ్చే ఐదేళ్లలో 130 బిలియన్ డాలర్లను భారత్ ఖర్చు చేయనుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఖర్చును దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ తెలిపారు.

Chhattisgarh : మనిషి కాదు మృగం.. తల్లిదండ్రుల్ని, అమ్మమ్మను చంపి బూడిద చేశాడు