Vande Bharat New colours : మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్ చూశారా..?
వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారిన వందే భారత్ న్యూ రైళ్ల ఫోటోలను రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Vande Bharat Train New colours
Indian Railways Vande Bharat Train New colours : వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారిన వందే భారత్ న్యూ రైళ్ల ఫోటోలను రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొత్త రంగులో.. సరికొత్త మార్పులతో పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
శనివారం (జులై 8,2023)చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ రైళ్ల తయారీని ఆయన పరిశీలించారు. ఐసీఎఫ్ (ICF) సీనియర్ అధికారులతో కలిసి కొత్త తరం హై-స్పీడ్ రైళ్ల ఉత్పత్తిని పరిశీలించారు.దీనికి సంబంధించిన ఫోటోలను..రంగు మారిన వందే భారత్ రైలు ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఐసీఎఫ్‌లోని అధికారులు, సిబ్బందితో మంత్రి మాట్లాడి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫోటోలను షేర్ చేశారు.
Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?
ఇప్పటి వరరు నీలం, తెలుపు రంగుల్లో ఉన్న వందే భారత్ రైళ్లు ఇక నుంచి ఆరెంజ్, గ్రే కలర్ కాంబినేషన్‌లో మారిపోనున్నాయి. వందే భారత్ రైలులో 25 కొత్త మార్పులు చేశామని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు. ఈ మార్పులు ప్రయాణీకుల అభిప్రాయాల మేరకే చేశామని స్పష్టంచేశారు. సీటు వాలే కోణాన్ని కూడా మార్చామని., సీట్లకు మెరుగైన కుషన్, మొబైల్ చార్జింగ్ పాయింట్లకు గతం కంటే మెరుగైన సౌకర్యం, ఎగ్జిక్యూటివ్ చైర్ ఫుట్ రెస్ట్, వాష్ బేసిన్ల లోతు, టాయిలెట్ లో వెలుతురు వంటి పలు విషయాల్లో మార్పు చేశామని తెలిపారు. వీటితో పాటు కొత్త సెక్యురిటీ ఫీచర్ యాంటీ-క్లైంబర్స్ పై కూడా పని జరుగుతోందని తెలిపారు. కొత్తగా మారిన ఈ రంగులను మన దేశ త్రివర్ణ పతాకం నుంచి కొత్త రంగును తీసుకున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా రైల్వే మంత్రి ప్రధాన కార్యాలయంలో దక్షిణ రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు, స్టేషన్ల పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, వేగాన్ని పెంచే పనులు, రైళ్ల టైమ్‌టేబులింగ్ వంటి విషయాలపై చర్చించారు.
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023