MP Varun Gandhi : వరుణ్ గాంధీకి కరోనా
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే

Varun
MP Varun Gandhi : దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ భారీ సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
వరుణ్ గాంధీ తన ట్వీట్ లో…”ఫిలిబిత్ లో 3 రోజుల పర్యటన జరిపిన తర్వాత వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మనం థర్డ్ వేవ్,ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం. కోవిడ్ మూడో వేవ్‌లో ఎన్నికల ప్రచారం చోటుచేసుకున్నందున అభ్యర్థులు, పొలిటికల్ వర్కర్లు ప్రికాషనరీ డోసులు తీసుకునేందుకు ఈసీ నిర్ణయం తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
ALSO READ TTD Oriental College : నా మాట వింటే పాస్ చేస్తా.. టీటీడీ కాలేజీలో కామాంధుడు.. ఆడియో లీక్