తల్లి ప్రేమ : కుక్క పిల్లలకు పాలిచ్చిన ఆవు

అనాథ కుక్కపిల్లలకు ఆవు తల్లిగా మారింది. తల్లి లేని ఆ కుక్కపిల్లలకు పాలిచ్చి అమ్మతనాన్ని చాటుకుంది ఈ అవు. ఇటీవల ఒక సింహాం చిరుత పిల్లకు పాలిచ్చిన వీడియో వైరల్ కాగా.. ఇప్పుడు  అనాథ కుక్క పిల్లలకు ఆవు పాలు ఇస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : January 7, 2019 / 05:22 AM IST
తల్లి ప్రేమ : కుక్క పిల్లలకు పాలిచ్చిన ఆవు

అనాథ కుక్కపిల్లలకు ఆవు తల్లిగా మారింది. తల్లి లేని ఆ కుక్కపిల్లలకు పాలిచ్చి అమ్మతనాన్ని చాటుకుంది ఈ అవు. ఇటీవల ఒక సింహాం చిరుత పిల్లకు పాలిచ్చిన వీడియో వైరల్ కాగా.. ఇప్పుడు  అనాథ కుక్క పిల్లలకు ఆవు పాలు ఇస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

అ.. అంటే అమ్మ.. ఆ అంటే.. ఆవు..  చిన్నతనంలో ఓనమాలు దిద్దినపుడే ఈ మాటలు నేర్చుకున్నాం. తల్లి ప్రేమ తెలిసిన ఆవు ఒకటి.. అనాథ కుక్కపిల్లలకు తల్లిగా మారింది. తల్లి లేని ఆ కుక్కపిల్లలకు పాలిచ్చి తన అమ్మతనాన్ని చాటుకుంది ఈ అవు. ఇటీవల ఒక సింహాం చిరుత పిల్లకు పాలిచ్చిన వీడియో వైరల్ కాగా.. ఇప్పుడు  కుక్క పిల్లలకు ఆవు పాలు ఇస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తల్లి కుక్క మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నప్పటికీ.. తల్లిని కోల్పోయిన చిన్నారి కుక్కపిల్లలు తమ తల్లే అనుకోని ఆవుకు చెంతకు చేరాయి. తన లేగ దూడలు కాకపోయినా.. పాల కోసం అలమటిస్తున్న కుక్కపిల్లలను చూసి ఆవు మనస్సు కరిగిపోయింది. అందుకే ఇలా వాటికి పాలిచ్చి ఆకలి తీరుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  ఇఫ్పుడా వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది.