Viral Video : రైల్వే ట్రాక్ కింద పడుకున్న యువకుడు.. వేగంగా దూసుకెళ్లిన ట్రైన్.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు
ఫేమస్ అవ్వాలనే తపనతో కొందరు యువకులు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్ క్రింద పడుకున్నాడు. ట్రాక్ పై నుంచి వేగంగా రైలు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి ఫీట్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral Video
Viral Video : ఎలాగైనా జనాదరణ పొందాలని చాలామంది భావిస్తున్నారు. అందుకోసం తమ జీవితాల్ని సైతం పణంగా పెడుతున్నారు. రైల్వే ట్రాక్ క్రింద ఓ యువకుడు పడుకుని ఉండగా.. ట్రాక్‌పై నుంచి రైలు వేగంగా వెళ్లిన వీడియో నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అభిషేక్ నరేడా (@NaredaAbhishek) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ మరియు గ్రౌండ్ మధ్య గ్యాప్‌లో నీలంరంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి పడుకున్నట్లు వీడియో చూపిస్తుంది. రైలు వేగంగా వచ్చి వ్యక్తిని దాటుతుంది. ట్రైన్ అంత వేగంగా వెడుతున్నా ఆ వ్యక్తి హాయిగా పడుకున్నాడు. ఈ వీడియోను అతని స్నేహితులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అయితే తెలియలేదు కానీ.. అభిషేక్ నరేడా షేర్ చేసిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ‘వైరల్ వీడియో ఎక్కడిదో నాకు తెలియదు కానీ ఇలాంటి వీడియోలు చేస్తున్నారు.. ఇది పూర్తిగా తప్పు.. అలాంటి వారిపై రైల్వే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పనులు చేసేముందు భవిష్యత్తు గురించి వందసార్లు ఆలోచించండి’ అనే శీర్షికతో అభిషేక్ పోస్ట్ షేర్ చేస్తూ రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF), కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు రైల్వేలకు కూడా ట్యాగ్ చేశారు.
Hyderabad: దొంగలు ఎంతపని చేశారు.. రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
ఈ పోస్టుపై నెటిజన్లు ‘ఇతను రైల్వే యాక్ట్ ప్రకారం కటకటాల వెనక్కి వెళ్లవలసి ఉంటుందని’ .. ‘ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని’ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.
वायरल वीडियो कहां का है यह तो पता नहीं लेकिन लोग इस तरह वीडियो बना रहे हैं जो सरासर गलत है ऐसे लोगों के खिलाफ रेलवे पुलिस को कड़ी कार्रवाई करनी चाहिए ताकि भविष्य में ऐसा करने से पहले सौ बार सोचे @RPF_INDIA @AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/VmqAvN3yYw
— ABHISHEK NAREDA (@NaredaAbhishek) July 1, 2023