Johny Johny Yes Papa : పాపులర్ ఇంగ్లీష్ రైమ్‌కి క్లాసికల్ టచ్.. ఏం పాడారబ్బా..?

జానీ జానీ ఎస్ పాపా.. ఈ రైమ్ రాని వారుండరు. ఈ రైమ్‌కి క్లాసికల్ టచ్ ఇచ్చి పాడితే ఎలా ఉంటుంది? వైరల్ అవుతున్న వీడియో చూస్తే వావ్ అంటారు.

Johny Johny Yes Papa : పాపులర్ ఇంగ్లీష్ రైమ్‌కి క్లాసికల్ టచ్.. ఏం పాడారబ్బా..?

Johny Johny Yes Papa

Updated On : January 23, 2024 / 7:11 PM IST

Johny Johny Yes Papa : జానీ జానీ ఎస్ పాపా.. అనే ఇంగ్లీస్ రైమ్ పాడని వారుండరు. ఈ రైమ్‌కి హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది? భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన వీడియో చూస్తే అద్భుతంగా ఉందంటారు. క్రియేటివిటీని మెచ్చుకుంటారు.

Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన వీడియో ఓపెన్ కాగానే ఒక వ్యక్తి హార్మోనియం వాయిస్తూ కనిపించారు. మరొకరు తబలా.. ఇంతలో గ్రూపు మధ్యలో కూర్చున్న వ్యక్తి క్లాసికల్ టచ్ ఇస్తూ ‘జానీ జానీ ఎస్ పాపా’ అంటూ పాట అందుకున్నారు. ఇంగ్లీష్ రైమ్‌కి శాస్త్రీయ సంగీతాన్ని జోడించి ఆయన పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. రెండు నిముషాల పాటు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘100 సంవత్సరాలకు పూర్వం ఈ వీడియో వచ్చి ఉంటే బ్రిటీష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉండేవారు’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేసారు.

PM Modi : కుష్బూ అత్త గారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న ప్రధాని మోదీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఇంగ్లీష్ రైమ్‌కి శాస్త్రీయ సంగీతం జోడించిన విధానం బాగుంది’ అని.. ‘గ్రామీ అవార్డు గెలుచుకున్న ప్రదర్శన’ అంటూ చమత్కారంగా కామెంట్లు పెట్టారు. ముఖ్యంగా పాట పాడిన గాయకుడిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.