Teacher Powerful Lesson : గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు బోధిస్తూ అందరి ప్రశంసలు అందుకున్న టీచర్

చిన్నారులకు పసి వయసు నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పేరెంట్స్ చెప్పాలి. ఓ టీచర్ తన తరగతి విద్యార్ధులకు ఈ అంశంపై బోధిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Teacher Powerful Lesson : గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు బోధిస్తూ అందరి ప్రశంసలు అందుకున్న టీచర్

Teacher Powerful Lesson

Updated On : August 10, 2023 / 11:15 AM IST

Teacher Powerful Lesson : సమాజంలో చిన్నారులు  లైంగిక వేధింపులకు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. చిన్నతనం నుంచి ఇంట్లో తల్లిదండ్రులు వారికి కొన్ని అంశాలపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్ధులకు బోధిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్

రోషన్ రాయ్ అనే ట్విట్టర్ యూజర్ (@RoshanKrRaii) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ స్కూల్ టీచర్ విద్యార్ధులకు ‘గుడ్ టచ్’.. ‘బ్యాడ్ టచ్’ గురించి బోధిస్తోంది. తలపై ఓదారుస్తున్నట్లు లేదా భరోసా ఇచ్చే కౌగిలింత, శారీరకంగా లేదా మానసికంగా హాని కలిగించే స్పర్శ వంటి వాటి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ టీచర్ ప్రాక్టికల్‌గా విద్యార్ధులకు బోధిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆమె చెబుతున్న విధానం విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు అలాంటి పరిస్థితులు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలో అవగాహన కలిగిస్తోంది.

Teacher Viral Video : టీచర్ దుస్తులపై బొమ్మలు గీసిన విద్యార్ధులు.. ఉద్యోగం చివరి రోజు ఆ దుస్తులు ధరించిన టీచర్‌

‘ఈ టీచర్ గుర్తింపు పొందడానికి అర్హురాలు. ఈ విధానం భారతదేశంలోని విద్యాసంస్థల్లో అమలు చేస్తే ఎంతో ఉపయోగకరం. దయచేసి విస్తృతంగా ప్రచారం చేయండి’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వీడియోలోని కంటెంట్ పాఠశాలల్లో బోధించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ‘పాజిటివ్ టచ్’..’నెగెటివ్ టచ్’ అనే భావనలను పిల్లలకు చెప్పడంలో తల్లిదండ్రులు ముందుండాలని నెటిజన్లు కూడా సూచించారు.