Viral Video : సబ్బుని కేక్‌లా తినేస్తున్న మహిళ.. నిజమేనా?
చాక్ పీస్‌లు, బలపాలు తినేవారిని చూసాం.. ఒక మహిళ సోప్ తింటున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. అది నిజంగా సబ్బేనా? లేక వేరే...............

Viral Video
Viral Video : కొంతమందికి చాక్ పీస్‌లు, బలపాలు తినే అలవాటు ఉంటుంది. ఓ లేడీ సోప్ తింటోంది. వామ్మో? ఇదేం అలవాటు అని అవాక్కయ్యారా? అందులో వాస్తవమెంతో తెలియాలంటే చదవండి.
Viral Post : తండ్రిని రూ. 2 లక్షలకి అమ్మకానికి పెట్టిన కూతురు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేడీ చాలా ఇష్టంగా సోప్ తింటున్నట్లు కనిపించిన వీడియో నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసింది.. అది సోప్ కాదు కేక్ అని.. కోల్‌కతాకు చెందిన బేకర్ సుచి దత్తా తయారు చేసిన కేక్ అది. నిజం తెలిసిన అంతా ఊపిరి పీల్చుకున్నారు.
21b_kolkata అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘నాకు సబ్బు తినడం ఇష్టం’ అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోలో సుచి దత్తా డెట్టాల్, సోప్‌ను చూపిస్తూ వీటిలో దేని టేస్ట్ బాగుంటుంది? అని అడుగుతుండగా వీడియో ఓపెన్ అవుతుంది. నాకు సోప్ అంటేనే ఇష్టం అంటూ సోప్ తిన్నట్లు కనిపిస్తుంది. వామ్మో.. అని జనాలు బెదిరిపోయే లోపు అది కేక్ అని రివీల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Viral Video : వాటే బ్యాలెన్స్..! నెత్తిమీద గ్యాస్ సిలిండర్ పెట్టుకుని బిందె మీద మహిళ డ్యాన్స్
‘డోన్ట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ అన్నట్లు వీడియో మొత్తం చూడకపోతే విషయం అర్ధం కాదని .. నిజంగా సోప్ తింటోందనుకున్నామని.. చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. సో.. సోషల్ మీడియాలో కనిపించే వింతలు తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడకుండా ఒక అభిప్రాయానికి రాకూడదని ఈ వీడియో చూసిన వారికి బాగా అర్ధమైంది.
View this post on Instagram