Elephant Birthday : గ్రాండ్‌గా ఏనుగు బర్త్ డే సెలబ్రేషన్స్.. విష్ చేసిన నెటిజన్లు

జంతు ప్రేమికులు తాము పెంచుకునే జంతువుల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తారు. కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఓ ఏనుగుకు జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

Elephant Birthday : గ్రాండ్‌గా ఏనుగు బర్త్ డే సెలబ్రేషన్స్.. విష్ చేసిన నెటిజన్లు

Elephant Birthday

Updated On : July 3, 2023 / 3:51 PM IST

Elephant Birthday : చాలామంది ఎంతగానో ఇష్టంగా పెంచుకున్న జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుతుంటారు. వాటిపై తమకున్న అభిమానం చాటుకుంటారు. గ్రాండ్‌గా జరిగిన ఓ ఏనుగు బర్త్ డే వేడుకలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Eephant emotional video : చనిపోయిన బిడ్డను బ్రతికించడానికి ఏనుగు ప్రయత్నం.. అస్సాంలో కన్నీరు పెట్టిస్తున్న వీడియో

కొన్ని వీడియోలు చూస్తే పెదవులపై చిరునవ్వుని.. మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. చాలామంది జంతు ప్రేమికులు వారు పెంచుకునే జంతువులను అపురూపంగా చూసుకుంటారు. ఇంట్లో మెంబర్స్‌లాగనే భావిస్తారు. వారు ఎలాగైతే పుట్టినరోజులు .. ప్రత్యేకమైన రోజులు సెలబ్రేట్ చేసుకుంటారో.. వారు పెంచుకునే జంతువులకు కూడా వేడుకగా జరుపుతారు. సుదర్శన్ (sudharsan112003) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఎలిఫెంట్ బర్త్ డే వేడుకలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఎక్కడిది? వీడియోలో వారు ఎవరు? వివరాలు తెలియలేదు కానీ.. ఏనుగు కోసం రకరకాల పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. పూల దండ వేశారు. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ; అని పాడుతూ విషెస్ చెప్పారు. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

Arikomban Elephoent : ఎట్టకేలకు పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగు …

ఏనుగుపట్ల వారికున్న ప్రేమ, భక్తి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘వాట్ ఏ లవ్లీ పార్టీ’ అంటూ ఏనుగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనేకమంది మనసు దోచుకున్న ఈ వీడియో వ్యూస్‌తో దూసుకుపోతోంది.