Bengaluru : అక్కడ ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా ఇచ్చారు.. కానీ.. ఓ షరతు పెట్టారు
బెంగళూరులోని ఓ ఐస్ క్రీం దుకాణం వారు ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా పంచి పెట్టారు. ఫ్రీ అనగానే ఊరికే ఇచ్చేయరు. అందుకోసం ఓ షరతు పెట్టారు. అదేంటో చదవండి.

Bengaluru
Bengaluru : ఏదైనా ఫ్రీ అంటే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చాలామంది ఎగబడతారు. డ్యాన్స్ చేస్తే ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తాం అంటే ఇక జనాలు ఎగబడకుండా ఉంటారా?
Tomato ice cream : ‘టొమాటో ఐస్ క్రీం’ కొత్త ఫుడ్ కాంబినేషన్ .. ‘రిప్ టొమాటో’ అంటున్న నెటిజన్లు
cornerhouseicecreams తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరునవ్వులు చిందిస్తోంది. ఐస్ క్రీం ఇష్టపడని వారు ఉండరేమో. ప్రతి సంవత్సరం జూలై 3 వ ఆదివారం ‘నేషనల్ ఐస్ క్రీం డే’ని జరుపుకుంటారు. అది ఈ సంవత్సరం జూలై 16 న జరిగింది. ఈ సందర్భంలో తమ దుకాణాన్ని ప్రమోట్ చేసుకోవాలని భావించిన బెంగళూరులోని ‘కార్నర్ హౌస్’ ఐస్ క్రీం దుకాణం వారు ఓ ఆఫర్ పెట్టారు. తమ కస్టమర్లకు ఐస్ క్రీం స్కూప్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తమ దుకాణం సీసీ టీవీ ముందు డ్యాన్స్ చేయాలని షరతు పెట్టారు.
ఇక ఐస్ క్రీం లవర్స్ అంతా దుకాణానికి క్యూ కట్టారు. ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఈ అద్భుతమైన వీడియోను ఐస్ క్రీం షాపు వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఉచిత ఐస్ క్రీం కోసం డ్యాన్స్ చేసిన వ్యక్తులను మా కెమెరాలు షూట్ చేసినపుడు అది కరిగిపోయేంత విలువైన పార్టీ అని మీకు తెలుసు. మా ఇందిరానగర్ బ్రాంచ్‌లో ఈ ఐస్ క్రీం డే వండర్ ఫుల్‌గా జరిగింది. మా అవుట్ లెట్‌ను ప్రేమ, నవ్వుల స్కూప్‌లతో నింపిన మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ షాప్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఐస్ క్రీం లవర్స్ మనసు దోచుకుంది.
View this post on Instagram