Delhi : మెట్రోలో ఫిట్‌ నెస్ కోచ్ విన్యాసాలు .. నెటిజన్ల విమర్శలు

ఢిల్లీ మెట్రోలో రీల్స్, డ్యాన్స్‌లు కామన్ అయిపోయాయి. మెట్రో అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి మరీ యువత వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఫిట్‌నెస్ కోచ్ ప్రదర్శించిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి.

Delhi  : మెట్రోలో ఫిట్‌ నెస్ కోచ్ విన్యాసాలు .. నెటిజన్ల విమర్శలు

Delhi

Updated On : July 19, 2023 / 1:40 PM IST

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఫిట్ నెస్ కోచ్ జగ్జోత్ కౌర్ విన్యాసాలు చేయడం వైరల్‌గా మారింది. ఇప్పటికే పలుమార్లు మెట్రోలో వీడియోలు, డ్యాన్స్‌లపై నిషేధం గురించి అధికారుల పలుమార్లు హెచ్చరించినా ఇలాంటివి రిపీట్ అవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్ట్రెయిట్ చేసుకున్నయువతి వీడియో వైరల్ .. తిట్టిపోస్తున్న నెటిజన్లు

మెట్రో అధికారులు పెడుతున్న ఆంక్షలు ప్రయాణికుల చెవికెక్కడం లేదు. ఢిల్లీ మెట్రోలో అయితే మరీ దారుణం. రోజూ వార్తల్లో ఉంటూనే ఉంది. తాజాగా ఫిట్‌ నెస్ కోచ్ అయిన జగ్జోత్ కౌర్ మెట్రో పివోటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్‌ని ఉపయోగించి విన్యాసాలు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో (jagjot_k143) షేర్ చేసింది. ‘ “కాలిస్థెనిక్స్ ఇన్ పబ్లిక్” అనే శీర్షికను కూడా యాడ్ చేసింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ‘మీరు చేసిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి.. కానీ మెట్రో వీటిని ప్రదర్శించడానికి ఉద్దేశించినది కాదు’ అని ఒకరు.. ‘మీ ప్రదర్శన అద్భుతం జగ్జోత్’ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో జంట వీడియో వైరల్..

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) పలుమార్లు మెట్రో ప్రాంగణంలో వీడియోలు చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగచేయకుండా.. వారిని గౌరవించాలని గుర్తుంచుకోండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక తాజా వీడియోపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా అధికారుల మాటలు పెడచెవిన పెట్టి కొందరు ఇలా వీడియోలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jagjot Kaur (@jagjot_k143)