Snake into Nose: పామును ముక్కులో పెట్టుకుని నోట్లో నుంచి బయటకు తీస్తున్న వీడియో షేర్ చేసిన హీరో

పామును నాదస్వరంతో ఆడించడం చూశాం. చేతితో పట్టుకోవడాలు, మెడలో వేసుకుని తిరగడాల వరకూ తెలుసు.. ముక్కులో పెట్టుకుని నోట్లో నుంచి తీయడం కాస్త వింతగా ఉంది కదా..

Snake into Nose: పామును ముక్కులో పెట్టుకుని నోట్లో నుంచి బయటకు తీస్తున్న వీడియో షేర్ చేసిన హీరో

Vidyut Jamwal (1)

Updated On : July 2, 2021 / 9:38 PM IST

Snake into Nose: పామును నాదస్వరంతో ఆడించడం చూశాం. చేతితో పట్టుకోవడాలు, మెడలో వేసుకుని తిరగడాల వరకూ తెలుసు.. ముక్కులో పెట్టుకుని నోట్లో నుంచి తీయడం కాస్త వింతగా ఉంది కదా.. నమ్మశక్యం కాని ఈ విషయం వింటే ఒళ్లు ఒక్క సారిగా జలదరిస్తుంది కదా..

మనకే ఇలా ఉంటే సెలబ్రిటీలు ఎలా ఫీలవుతారో అని ఒక్కసారి ఆలోచించండి. మీరెలా అనుకున్నా ఈ బాలీవుడ్ హీరో ఎక్కడ చూశాడో కానీ, తన ఇన్ స్టా అకౌంట్లో ఆ వీడియో పోస్టు చేశాడు.

ఈ భయంకరమైన వీడియో షేర్ చేస్తూ.. ఐ లవ్ మై ఇండియా అని కామెంట్ రాశాడు. దీనిని ఆసాంతం చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొందరేమో ఎందుకలా చేశాడంటుంటే, మరికొందరు మూగ జీవాలను హింసిస్తున్నారంటూ సూక్తులు చెబుతున్నారు. మరి మీరూ ఈ వీడియో చూసి ఏదైనా కామెంట్ చేస్తారా..