Vigilance raids: ఇంజనీర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడిన వైనం.. ఇంకా కొనసాగుతోన్న దాడులు
ఓ ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేయగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో వెతుకుతున్న కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతుండడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. బిహార్ పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ రాయ్ కిషన్గంజ్ డివిజన్ గ్రామీన వ్యవహారాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతడు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Vigilance raids
Vigilance raids: ఓ ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేయగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో వెతుకుతున్న కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతుండడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. బిహార్ పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ రాయ్ కిషన్గంజ్ డివిజన్ గ్రామీన వ్యవహారాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతడు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఆయన ఇంట్లో నిన్న దాడులు చేయగా మొత్తం రూ.5 కోట్ల నగదు బయటపడింది. సంజయ్ కుమార్ రాయ్ నగదును అతడికి కింది అధికారుల ఇంట్లో దాచేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి కింది అధికారులు ఇళ్ళలో కూడా అధికారులు దాడులు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో సోదాలు చేసి మరింత సొమ్మును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. సంజయ్ భూములు, బ్యాంకు లాకర్లను గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
CHINA Drought : కరవుతో అల్లాడుతున్న చైనా .. ప్రపంచ దేశాలపై ప్రభావం..