CHINA Drought : కరవుతో అల్లాడుతున్న చైనా .. ప్రపంచ దేశాలపై ప్రభావం..
ఓ వైపు వేడి గాలులు.. మరోవైపు వరదలు.. చైనాలో పరిస్థితి వింతగా కనిపిస్తోంది. విలయం ఏదైనా కరువుకే దారి తీస్తోంది. మరి చైనాలో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయ్. అక్కడి కరువుతో మన జేబుకు చిల్లు పడక తప్పదా.. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న వార్నింగ్స్ ఏంటి ?

CHINA Drought
CHINA Drought : ఓ వైపు వేడి గాలులు.. మరోవైపు వరదలు.. చైనాలో పరిస్థితి వింతగా కనిపిస్తోంది. విలయం ఏదైనా కరువుకే దారి తీస్తోంది. మరి చైనాలో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయ్. అక్కడి కరువుతో మన జేబుకు చిల్లు పడక తప్పదా.. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న వార్నింగ్స్ ఏంటి ?
ఎప్పుడూ చూడని కరువు విలయ తాండవం చేస్తుండడంతో.. చైనాలో చాలావరకు పంటలు ఎండిపోతున్నాయ్. మిగిలిన కాస్త పంటను ముందుగానే కోసేస్తున్నారు. దేశానికి కావాల్సిన బియ్యాన్ని.. యాంగ్జీ పరిసర ప్రాంతాలతో పాటు సిచువాన్ ప్రావిన్స్‌లోనే పండిస్తారు. అలాంటిది ఇప్పుడు అక్కడ చుక్క నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇది ఇప్పుడు చైనా అధికారులను మరింత భయపెడుతోంది. దాదాపు 70రోజులుగా వీస్తున్న వేడి గాలులతో.. పంట ఏ మాత్రం మిగలని పరిస్థితి చైనాలో కనిపిస్తోంది. ఆగస్ట్ ఒకటి నుంచి చైనాలోని చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందో !
ఈ కాలంలో పండించే పంటనే.. చైనాలో తినడానికి వినియోగిస్తారు. పరిస్థితి అంతా బాగుంటే… రాబోయే రెండు నెలల్లో చేతికి రాబోయే పంట.. చైనావాసులకు ఆహారంగా మారేది. మిగిలింది ఎగుమతి చేసేవారు. ఎక్స్‌పోర్ట్ సంగతి తర్వాత… ఇప్పుడు దేశ ప్రజలకు తిండి అందించడానికి కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దీంతో దిగుమతుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ధరలు భగ్గుమంటున్నాయ్. దీనికితోడు చైనా డిమాండ్ కూడా యాడ్ కావడంతో.. ధరలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
రేట్లు భగ్గుమనడం ఖాయం. ముఖ్యంగా గోధుమలు, బియ్యంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించడం ఖాయం. ప్రపంచంలో బియ్యం, గోధుమల ఉత్పత్తిలో చైనా టాప్‌లో ఉంది. ఏటా దాదాపు 211 మిలియన్ టన్నుల బియ్యం, 133 టన్నుల గోధుమలు ఉత్పత్తి చేస్తుంది. ఐతే ఇప్పుడు దేశంలో ఏర్పడిన తీవ్ర కరువుతో.. ఈ ఉత్పత్తిపై ప్రభావం పడడం ఖాయం. దీంతో దేశ ప్రజల ఆహార అలవాట్లు తీర్చేందుకు.. చైనా భారీగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. చైనాలాంటి దేశం ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే.. డిమాండ్ భారీగా పెరిగి ధరలు భగ్గుమనడం ఖాయం. చైనాలో కరువు డైరెక్ట్‌గా ఆ దేశాన్నే కాదు.. ప్రపంచంపై మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయ్. మన దేశం నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులు చైనాకు పెరిగితే.. దేశీయంగా వాటి ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
ఇక చైనా పరిస్థితి గందరగోళంగా ఉంది. దేశంలో సగం ప్రాంతాన్ని కరువు వెంటాడుతుంటే.. ఉత్తర, వాయువ్య ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయ్. ఉత్తర చైనా ప్రాంతంలో రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవడం ఖాయమన్న అధికారులు హెచ్చరికలు జనాలను మరింత టెన్షన్ పెడుతున్నాయ్. ఏమైనా చైనా ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. మంట పెడుతున్న వేడి గాలులు ఓవైపు.. మరణాన్ని పరిచయం చేస్తున్న వరదలు మరోవైపు.. ముంచుకొస్తున్న మహమ్మారి మరోవైపు.. ఇలాంటి కష్టాల నుంచి చైనా బయటపడడం ఇప్పటికిప్పుడు కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.