Viral Video : యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది.. వీడియో వైరల్!
Viral Video : అంబేద్కర్ కూడలి దగ్గర బైకుపై వెళ్తున్న యువకుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన బాధితుడిని వెంటనే మౌరానిపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు.

Car Rams Man Riding Bike In UP ( Screenshot Grab from Video)
Viral Video : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్ దూరంగా ఎగిరిపడ్డాడు. అంతటితో ఆగలేదు. బాధితుడి బైక్‌ను రోడ్డుపై దాదాపు 500 మీటర్ల వరకు కారు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన రాజధాని లక్నోకు 400 కిలోమీటర్ల దూరంలోని ఝాన్సీలోని మౌరానీపూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో, మార్కెట్ స్థలంలో బైకును కారు ఈడ్చుకెళ్లడం కనిపించింది.
అయితే, బైక్ కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. గాయపడిన వ్యక్తి మౌరానీపూర్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. “నేను మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాను. అతి వేగంగా దూసుకొచ్చిన కారు నన్ను ముందు నుంచి ఢీకొట్టింది. ఆపై నా బైక్‌ను ఈడ్చుకెళ్లింది” అని బాధితుడు వాపోయాడు. స్థానికులు కారును వెంబడించి అందులోని వ్యక్తులను కొట్టారు.
“మేం బస్టాండ్‌లో కూర్చొని ఉండగా.. కారు స్ప్లెండర్ బైక్‌ను ఈడ్చుకెళ్లడం చూశాం. పోలీసులు కూడా కారును వెంబడిస్తున్నారు. మేం కారును ఆపి పట్టుకోగలిగాం. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు” అని అభిషేక్ గుప్తా చెప్పారు. కారు నడిపిన వ్యక్తి మద్యం తాగినట్లు గుర్తించారు. స్థానికులు ఆగ్రహంతో కారులోని వ్యక్తులను చితకబాదడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంబేద్కర్ కూడలి దగ్గర బైకుపై వెళ్తున్న యువకుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన బాధితుడిని వెంటనే మౌరానిపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీనియర్ పోలీసు లక్ష్మీకాంత్ గౌతమ్ పేర్కొన్నారు.