Viral Video: చలిలో బైకుపై అమ్మాయిని ఎక్కించుకుని.. ఒళ్లు తెలియకుండా దూసుకెళ్తూ..

రోడ్డుపై ఇలా వారు సన్నిహితంగా ఉంటూ స్కూటర్‌పై వెళుతుండగా మరో వాహనదారుడు వీడియో తీశాడు.

Viral Video: చలిలో బైకుపై అమ్మాయిని ఎక్కించుకుని.. ఒళ్లు తెలియకుండా దూసుకెళ్తూ..

Viral Video

Updated On : January 14, 2024 / 8:37 PM IST

ప్రేమ మత్తులో మునిగిపోతే గాల్లో తేలినట్లు ఉంటుందని అంటారు. ఆ మత్తులో కొందరు ప్రేమికులు ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ప్రేమికులు బైక్‌పై వెళ్తూ తమదైన లోకంలో తేలిపోతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు అధికమైపోతున్నాయి.

తాజాగా ముంబై బాంద్రా రిక్లమేషన్ రోడ్‌లో ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో యువకుడు స్కూటర్ నడుపుతున్నాడు. అతడి ప్రియురాలు వెనుక కూర్చోకుండా, అతడికి ఎదురుగా కూర్చుంది.

రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా వారు సన్నిహితంగా ఉంటూ స్కూటర్‌పై వెళుతుండగా మరో వాహనదారుడు వీడియో తీశాడు. రోడ్లపై ఆ జంట అసభ్యకరమైన రీతిలో కనపడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బైకుపై యువకుడిని కౌగిలించుకుని, అతని ఒడిలో కూర్చుని అమ్మాయి ప్రదర్శించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ జంటను అరెస్టు చేయాలని ముంబై పోలీసులకు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

 

Kite Festival : ప్రాణాలు తీస్తున్న పతంగుల పండుగ.. హైదరాబాద్‌లో పలువురు మృతి