సరస్సు నుంచి రైలులోకి నీళ్లు చిమ్మిన యువకులు.. ట్రైన్ నుంచి ప్రయాణికులు దిగి ఏం చేశారో తెలుసా?

యువకులు మోటార్‌సైకిల్‌ను సరస్సులో పార్క్ చేసి.. దాని ద్వారా ప్రయాణిస్తున్న రైలుపై నీటిని చిమ్మడం పట్ల రైలులోని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరస్సు నుంచి రైలులోకి నీళ్లు చిమ్మిన యువకులు.. ట్రైన్ నుంచి ప్రయాణికులు దిగి ఏం చేశారో తెలుసా?

రైల్వే ట్రాక్‌ల దగ్గర కొంతమంది పాకిస్థాన్ యువకులు రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగేలా చేశారు. ట్రాక్‌కు ఎడమవైపు ఉన్న సరస్సులోని నీళ్లను రైలులోని ప్రయాణికులపై పడేలా చేశారు. అందుకోసం బైకును వాడారు.

బైకును రేసు చేసి వెను టైరును వేగంగా కదిలిస్తూ సరస్సులోని నీళ్లు రైలుపై పడేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యువకులు మోటార్‌సైకిల్‌ను సరస్సులో పార్క్ చేసి.. దాని ద్వారా ప్రయాణిస్తున్న రైలుపై నీటిని చిమ్మడం పట్ల రైలులోని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు కిందికి దిగారు. వారిని చూసి ఆ యువకులు పారిపోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ యువకులను ప్రయాణికులు పట్టుకున్నారు. వారి బైకును రైలులో వేసుకుని వెళ్లిపోయారు. ఆ యువకులకు ప్రయాణికులు తగిన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Telecom Act : కొత్త టెలికం చట్టం అమల్లోకి.. ఇకపై ప్రభుత్వానిదే అధికారం.. కీలక మార్పులివే.. వినియోగదారులపై ప్రభావం ఎంతంటే?