అప్పడాలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మరోసారి వాటిని తినరు

పరిశుభ్రత పాటించకుండా స్నాక్స్ తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అప్పడాలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మరోసారి వాటిని తినరు

Viral Video

భోజన ప్రియులు అధికంగా ఉండే దేశం భారత్. దేశంలో ఎన్నో రకాల రుచికర ఆహార పదార్థాలు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలోనూ లభ్యమవుతుంటాయి. ఆ కర్రీలు, బిర్యానీలు, స్నాక్స్ చూస్తుంటే నోరూరుతుంది. స్నాక్స్‌ను తయారు చేస్తూ వాటిని సరఫరా చేస్తూ చాలా మంది ఉపాధి పొందుతుంటారు.

అయితే, కొందరు పరిశుభ్రత పాటించకుండా తయారు చేసే తినుబండారాలు ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. ఓ ప్రాంతంలో అప్పడాలను పరిశుభ్రత పాటించకుండా తయారు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అప్పడాలు తయారు చేయడానికి పిండిని కలిపిన పెద్ద పాత్ర అపరిశుభ్రంగా ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు.

అలాగే, అప్పడాలను కట్ చేయడానికి కాలితో మహిళ దాన్ని తొక్కిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. అప్పడాలను అపరిశుభ్ర కవర్లపై ఎండబెట్టారు. ఇలా ప్రతి అంశంలోనూ పరిశుభ్రతను పాటించలేదు. అప్పడాలను చాలా మంది అన్నంలో నంచుకుని తింటుంటారు. పిల్లలు మరీ ఇష్టంగా వీటిని తింటారు. పరిశుభ్రత పాటించకుండా స్నాక్స్ తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akola ka Foodie (@dabake_khao)

CM Revanth Reddy : కేసీఆర్.. గంజాయి మొక్కలు నాటి వెళ్లారు.. ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం