చేతిలో లాఠీ మాత్రమే.. అయినా పోలీస్ ఎలా ఢిల్లీ గన్ మేన్‌కు ఎదురునిల్చాడంటే!

విద్యార్ధులపై లాఠీఛార్జీలు, యాంటీ సీఏఏ ప్రదర్శనకారులపై దుందుడు లాఠీఛార్జీలతో ఢిల్లీ పోలీసులు మీద విమర్శలు ఎక్కువ. నిరసనకారులపై అచారకంగా ప్రవర్థిస్తారన్న చెడ్డపేరూ ఉంది. JNU విద్యార్ధులపై దాడులుచేసిన రౌడీలు తమ ముందునుంచి వెళ్తున్నా పట్టించుకోలేదన్న విమర్శలు పోలీసుల మీదున్నాయి.
సోమవారం మాత్రం, గగుర్పొడిచే వీడియో ఒకటి బైటకొచ్చింది. జఫ్రాబాద్ లో విచ్చలవిడిగా కాలుస్తున్న గన్ మేన్ ఎదురుగా నిల్చొన్నాడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్. భయపడలేదు. ఆ సాయుధుని పేరు షారూఖ్. అప్పటిదాకా గాల్లోకి కాల్చుతూ తిరుగుతున్నాడు.
ఈ వీడియాను దగ్గర్లోని బిల్డింగ్ మీద నుంచి షూట్ చేశారు. రెడ్ టీషర్ట్ వేసుకున్న సాయుధుడు గాల్లోకి చాలా రౌండ్స్ పేల్చాడు. riot gearలో ఉన్న పోలీసు ఎదురునిచ్చాడు. అతనికి తోడు ఎవరూ లేరు. గన్ మేన్ కుమాత్రం ఆరుగురు తోడున్నారు.
వాళ్లు రాళ్లు విసురుతూ, వెనక్కు వెళ్లిపోమ్మని పోలీసును హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పోలీసుల బెదరలేదు. సాయుధుడి ముందుకెళ్లాడు. మరోసారి గాల్లోకి కాల్పులు. అక్కడితోనే వీడియో ఆగిపోయింది.
ప్రత్యక్షసాక్షులు చెప్పిందాని ప్రకారం, పోలీసుకు తోడుగా మరికొందరు వచ్చారు. సాయుధుడ్ని పట్టుకున్నారు.
An anti-CAA protester open fire in #Jaffarabad area. He pointed pistol at policeman but the cop stood firm. He fired around eight rounds. @DelhiPolice pic.twitter.com/0EOgkC6D40
— Saurabh Trivedi (@saurabh3vedi) February 24, 2020
మొదట ఈ గన్ మేన్ సి.ఏ.ఏ. అనుకూల వ్యక్తిగా ప్రచారం చేశారు. వ్యతిరేకుల మీద కాల్పులు సాగించడానికి అన్నారు. ఆ తర్వాత మరో వాదనా వినిపించింది. అసలు షారూఖ్ సి.ఏ.ఏ. వ్యతిరేక గుంపునుంచి బైటకొచ్చి కాల్పులు జరిపాడంట. అతన్ని అరెస్ట్ చేసి, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసుపెట్టారు.
మంగళవారం నాటికి హెడ్ కానిస్టేబుల్ తోసహా ఏడుగురు చనిపోయారు. వందమంది గాయపడ్డారు. అందుకే చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ హింసాకాండను ఖండించారు. అమిత్ షాను కలసి, తక్షణం సమస్యను పరిష్కారించాల్సిందిగా కోరారు. ఆయన ఆధీనంలోనే కదా ఢిల్లీ పోలీసు విభాగం ఉండేది.
మీటింగ్ తర్వాత కేజ్రీవాల్ కాన్ఫిడెంట్ గా కన్పించారు. అవసరమైన చోట్లకి పోలీసు బలగాలు వెళ్తాయని హోంమంత్రి చెప్పారని అన్నారు. అల్లర్లను అణచమని పోలీసులకు పైస్థాయి నుంచి ఆర్డర్స్ రాలేదని అందుకే వాళ్లేమీ చేయలేక పోతున్నారని అన్నారు.