Viral Video: నడిరోడ్డుపై యువకుడిని పడేసి, తంతూ, చెంపదెబ్బలు కొడుతూ రెచ్చిపోయిన పోలీసు

గవర్నర్‌ కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో ఆనంద్ నగర్ చౌరస్తా వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఆ సమయంలో..

Viral Video: నడిరోడ్డుపై యువకుడిని పడేసి, తంతూ, చెంపదెబ్బలు కొడుతూ రెచ్చిపోయిన పోలీసు

Updated On : January 19, 2025 / 3:05 PM IST

నడిరోడ్డుపై యువకుడిని కింద పడేసి, తంతూ, చెంపదెబ్బలు కొడుతూ రెచ్చిపోయాడు ఓ పోలీసు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గవర్నర్‌ కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో ఆనంద్ నగర్ చౌరస్తా వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. కాన్వాయ్‌ వద్దకు ఎవరూ రాకుండా చూసుకుంటున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు కాన్వాయ్‌కు కాస్త దగ్గరగా నిలబడే ప్రయత్నం చేశాడు.

దీంతో ట్రాఫిక్‌ పోలీసుకి చిర్రెత్తుకొచ్చింది. ఓ యువకుడిని లాగడంతో అతడు కిందపడిపోయాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ యువకుడిని పోలీసు కాలితో రెండుసార్లు తన్నాడు. ఆ తర్వాత ఆ యువకుడి చెంపచెళ్లుమనిపించాడు.

రోడ్డు పక్కన నిలబడ్డ వారు అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పోలీసు తీరుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ పోలీసు తీరుపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Amit Shah: చంద్రబాబు వెనుక మోదీ కొండలా అండగా ఉన్నారు : అమిత్ షా