శాంతాక్లాజ్‌గా కోహ్లి..అనాథ పిల్లలకు గిప్టులు: కేరింతలు కొట్టిన చిన్నారులు

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 07:55 AM IST
శాంతాక్లాజ్‌గా కోహ్లి..అనాథ పిల్లలకు గిప్టులు: కేరింతలు కొట్టిన  చిన్నారులు

Updated On : December 22, 2019 / 7:55 AM IST

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శాంతాక్లాజ్ గా అవతారం ఎత్తారు. నిరుపేద పిల్లలకు చక్కగా గిఫ్టులిచ్చి సందడి చేశారు కోహ్లీ. తమ కళ్లముందు విరాట్ కోహ్లీ శాంతాక్లాజ్ గా ప్రత్యక్షమయ్యేసరికి చిన్నారులంతా ఆశ్చర్యపోయారు. కేరంతలు కొట్టారు. సంబరంగా గెంతులేశారు. క్రిస్మస్ రోజుల్లో శాంతాక్లాజ్ కు సందడి చేస్తుంటం చిన్నారులకు బహుమతులు ఇవ్వటం మామూలే. 

కానీ ఓ స్టార్ క్రికెటర్ ..భారత్ కు పరుగుల పంట పండించే విరాట్ కోహ్లీ శాంతాక్లాజ్ గా వచ్చేసరికి చిన్నారులు ఆనందం పట్టలేకపోయారు. కేరింతలు కొట్టారు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు. వాళ్లకు క్రిస్మస్ ముందే వచ్చేసినట్లైంది. ఆ గిప్టులు తీసుకున్న పిల్లల ముఖాలు చూస్తే…లోకంలోని ఆనందమంతా వారి కల్మషం లేని ముఖాల్లోనే కనిపించింది. 

కోల్‌కతాలోని ఓ అనాథ శరణాలయానికి శాంతాక్లాజ్ రూపంలో వెళ్లిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ… గిఫ్టులు ఇచ్చారు. విరాట్ వస్తున్నట్లు ఎవరికీ తెలియదు. శాంతాక్లాజ్ రూపంలో ఉన్నది విరాట్ అని పిల్లలకు కూడా తెలియదు. ఒక్కసారిగా వాళ్లకు తన ఫేస్ చూపించగానే… పిల్లలు ఫుల్ ఖుషీ అయిపోయారు.