Independence Day 2026 : ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలు డైరెక్టుగా చూసే ఛాన్స్! రూ.20 నుంచే టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి
Independence Day 2026 : ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న 2026 స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా? ఆన్లైన్లో టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Independence Day 2026
- ఆమంత్రన్ పోర్టల్ ద్వారా ఇండిపెండెన్స్ డే టిక్కెట్లు బుక్ చేయండి
- వివిధ కేటగిరీలలో టిక్కెట్ ధరలు రూ. 20 నుంచి ప్రారంభం
- ఆగష్టు 15న ఉదయం 5:00 గంటలకు రిజిస్ట్రేషన్ షురూ
Independence Day 2026 : ఆగస్టు 15.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చూస్తున్నారా?
ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం, పరేడ్, వైమానిక దళ ప్రదర్శన, ఇతర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీరు నేరుగా వెళ్లి హాజరు కాలేరు. టిక్కెట్లు తప్పనిసరిగా ఉండాలి. పరేడ్‌కు వెళ్లే సందర్శకులు నిర్దేశిత ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. కానీ, దరఖాస్తుదారులు తమ టిక్కెట్ బుకింగ్ చేసే సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రతి స్టెప్ జాగ్రత్తగా చేయాలి. దరఖాస్తుదారు తమ ఇష్టానుసారం జనరల్, స్టాండర్డ్ ప్రీమియం క్లాసులను ఎంచుకోవచ్చు. అయితే, వీటికి వేర్వేరు ధరలు ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం 2026 రెడ్ ఫోర్ట్ టిక్కెట్ల కోసం ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బ్ స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం..
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలాగంటే? :
రిజిస్ట్రేషన్ కోసం మీరు ఆమంత్రన్ పోర్టల్‌ను విజిట్ చేయాలి. మీ పేరు, ఇమెయిల్ మొబైల్ నంబర్‌తో కొత్త యూజర్‌గా సైన్ ఇన్ చేయాలి. ఆ తర్వాత, మీకు వచ్చిన OTP ద్వారా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ తప్పనిసరి.
మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి. ఈవెంట్ కోసం మీరు రిజిస్టర్ చేసే గెస్ట్ వివరాలతో ‘Ad Guest’ ఫారమ్‌ను నింపండి. గెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం మీరు వ్యాలీడ్ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇందులో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఓటర్ ఐడీ ఏదైనా ఉండొచ్చు.
ఆ తర్వాత, ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుక 2026’ అనే ఈవెంట్‌ను ఎంచుకోవాలి. జనరల్, స్టాండర్డ్ ప్రీమియంలో మీకు నచ్చిన టికెట్ టైప్ ఎంచుకోండి. UPI, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయ్యాక పాస్‌ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో ఉంచుకోండి.
టిక్కెట్ ధరలు ఎంతంటే?
స్వాతంత్య్ర దినోత్సవం 2026 రెడ్ ఫోర్ట్ కార్యక్రమాన్ని సందర్శించేందుకు టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.
- జనరల్ : రూ. 20
- స్టాండర్డ్ : రూ. 100
- ప్రీమియం : రూ. 500
తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే :
మీరు స్వాతంత్య్ర దినోత్సవం 2026 రెడ్ ఫోర్ట్ టిక్కెట్ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం..
- బుకింగ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ మీ వద్ద అందుబాటులో ఉండాలి.
- టూరిస్ట్ గా ఎర్రకోట సందర్శించే జనరల్ టిక్కెట్లతో ఇండిపెండెన్స్ కార్యక్రమానికి ఎంట్రీ ఉండదు.
- సెక్యూరిటీ చెకింగ్స్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. ముందుగానే అక్కడికి చేరుకోండి
- పవర్ బ్యాంకులు, ఫుడ్, కెమెరా వంటి బరువైన వస్తువులను తీసుకురావద్దు
- ఇలాంటి వాటిని లోపలికి అనుమతించరు.
ఎంట్రీ టైమ్ :
టికెట్లు ఉన్న విజిటర్ల కోసం ఎంట్రీ టైమ్ ఆగష్టు 15, 2026న ఉదయం 5:00 గంటలకు ఓపెన్ అవుతుంది. మీరు ఉదయం 6:30 గంటలకల్లా వెన్యూ లోపల కూర్చోవాల్సి ఉంటుంది.
