Viral Video: తాజ్ హోటల్ లో ఆహారం తిని… చిల్లరతో బిల్లు చెల్లించిన యువకుడు

తిన్నాక బిల్ ఇవ్వాలని అడిగాడు. వెయిటర్ బిల్ తో వచ్చాక ఎంత ఖర్చు అయిందో చూశాడు సిద్ధేశ్. తన బ్యాగులో ఉన్న కాయిన్స్ తీసి లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు నవ్వుకున్నారు. బిల్ ను చిల్లర రూపంలో వెయిటర్ కు ఇచ్చాడు సిద్ధేవ్. ఆ చిల్లర తీసుకుని లెక్కపెట్టుకోవడానికి వెయిటర్ వెళ్లిపోయాడు.

Viral Video: తాజ్ హోటల్ లో ఆహారం తిని… చిల్లరతో బిల్లు చెల్లించిన యువకుడు

Viral Video

Updated On : February 22, 2023 / 6:02 PM IST

Viral Video: ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం తినాలంటే చాలా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తారు. మంచి దస్తులు వేసుకుని వెళ్లి స్టైల్ గా తింటూ, కార్డులతో బిల్లు కడతారు. అయితే, ముంబైకి చెందిన యువకుడు సిద్ధేశ్ లోకరే తాజాగా తాజ్ హోటల్ కు వెళ్లి ఆహారం తిని, బిల్లును చిల్లర రూపంలో చెల్లించాడు.

ఆ సమయంలో వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అది బాగా వైరల్ అవుతోంది. తాజ్ హోటల్ కు వెళ్లాలనుకుంటున్నానని మొదట సిద్ధేశ్ చెప్పాడు. అందులోకి వెళ్లాలంటే మంచి దుస్తులు ఉండాలని కదా? అని మంచి సూట్ వేసుకున్నాడు. హోటల్ లోకి వెళ్లి టేబుల్ వద్ద కూర్చొని.. పిజ్జా, మాక్‌టెయిల్స్ ఆర్డర్ ఇచ్చాడు.

తిన్నాక బిల్ ఇవ్వాలని అడిగాడు. వెయిటర్ బిల్ తో వచ్చాక ఎంత ఖర్చు అయిందో చూశాడు సిద్ధేశ్. తన బ్యాగులో ఉన్న కాయిన్స్ తీసి లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు నవ్వుకున్నారు. బిల్ ను చిల్లర రూపంలో వెయిటర్ కు ఇచ్చాడు సిద్ధేవ్. ఆ చిల్లర తీసుకుని లెక్కపెట్టుకోవడానికి వెయిటర్ వెళ్లిపోయాడు. అనంతరం సిద్ధేశ్ హోటల్ నుంచి ఇంటికి వెళ్లాడు.

 

View this post on Instagram

 

A post shared by Siddhesh Lokare??‍♂️ (@sidiously_)

Bihar: తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో ఆపించేసిన నితీశ్ కుమార్.. కారణం ఏంటంటే?