‘సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడీజీ’ : ఇలాక్కూడా వాడేసుకుంటున్నారు

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 04:18 AM IST
‘సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడీజీ’ : ఇలాక్కూడా వాడేసుకుంటున్నారు

Updated On : March 5, 2020 / 4:18 AM IST

కరోనా వైరస్ వచ్చాక ప్రజల్లో సృజనాత్మకత పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన మాస్క్ లు వేసుకుంటున్నారు. ఎవరి తోచినట్లుగా వారు వినూత్నమైన మాస్క్ లు ధరిస్తున్నారు. ఈ మాస్క్ ఫన్నీగా కొన్ని కనిపిస్తుంటే మరికొన్ని పొలిటికల్ కు  సంబంధించినవి ఉంటున్నాయి. అటువంటివే పశ్చిమబెంగాల్‌లో కొన్ని మాస్క్ లు వినూత్నంగా దర్శనమిస్తున్నాయి. తాజాగా కలకత్తాలో బీజేపీ నేతలు ధరించిన మాస్క్ లు సందడి చేస్తున్నాయి. 

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ దేశాలతో పాటు  ఇండియాను కూడా వణికిస్తోంది. పలు నగరాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ క్రమంలో  కలకత్తాలో బీజేపీ నేతలు ఫేస్‌ మాస్క్‌లను వినూత్నంగా రూపొందించి ప్రజలకు అందజేస్తున్నారు. మాస్క్‌లపై ‘సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడిజీ’ అని ప్రింట్‌ వేయించారు. మాస్క్‌పై బీజేపీ ఎన్నికల గుర్తు ‘కమలం’ కూడా ఉండడం గమనించాల్సిన విషయం. ఈ మాస్క్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (కరోనా లేదు..బాగానే ఉన్నా – జాకీ చాన్)

కాగా..కరోనా వైరస్ భూతానికి చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా ప్రజలు మృతి చెందారు. లక్ష మందికి పైగా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయా దేశాల్లో వారు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. పలు దేశాలకు విస్తరించిన కరోనా ఇండియాలో పలు నగరాల్లోకి కూడా వ్యాపించింది.