మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2019 / 11:01 AM IST
మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి

పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019)  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో  కలిసి పాల్గొన్నారు. అమిత్ కుటుంబసభ్యులను ఓదార్చుతూ రాహుల్ ఈ విధంగా అన్నారు. 

మన నాన్నని కూడా ఇలాగే కోల్పోయామని నా చెల్లెలు ప్రియాంక చెప్పింది. మీ గుండెల్లోని భాధను మేం అర్థం చేసుకోగలం. కొన్ని నిమిషాలు మీతో కలిసి కూర్చోవాలని ఇక్కడి వచ్చాం. ఈ విషాధ సమయంలో మీకు అండగా మేం ఉంటామని చెబుతున్నా. దేశంలోని అందరి తరపున హృదయపూర్వకంగా మీకు, మీ కుమారులకు ధన్యవాదాలు అని జవాను కుటుంబసభ్యులను రాహుల్ ఓదార్చారు. తండ్రిని గుర్తుచేసుకొన్న సమయంలో రాహుల్ భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టుకొన్నారు. తర్వాత మరో అమర జవాన్ ప్రదీప్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను రాహుల్, ప్రియాంక ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాహుల్ వెంట  జ్యోతిరాదిత్య సింధియా, రాజ్ బబ్బర్ లు కూడా  ఉన్నారు. రాహుల్, ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాలు అమర జవాన్ అమిత్ కుమార్ గోరి ఫొటో దగ్గర నివాళులర్పిస్తున్న వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన  పుల్వామా బ్లాస్ట్ లో అమరులైన 40 మంది జవాన్లకు సంబంధించి రాజకీయాలు చేయకూడదన్న మేసేజ్ తోనే..ఇద్దురు టాప్ ఎలక్షన్ క్యాంపెయినర్ల సర్ ప్రైజ్ విజిట్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 

రాహుల్ గాంధీ కూడా ఓ వీడియోను ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అమర జవాన్ ప్రేయర్ మీటింగ్ కి వెళ్తున్న సమయంలో రోడ్ సైడ్ దాబా దగ్గర టీ బ్రేక్ కోసం ఆగిన వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో.. తనను కలిసేందుకు వచ్చిన కొంతమంది మహిళలు, చిన్నారులతో ప్రియాంకా కొంత సమయం గడిపింది. వారిని ఆప్యాయంగా పలకరించింది. కొంతమంది ఆమెతో సెల్పీలు తీసుకొన్నారు.

రాహుల్ పక్కన నిలబడి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ చిన్నారితో ఇక్కడి నుంచి మీ ఊరు ఎంత దూరం అని ప్రియాంక ఓ చిన్నారిని ప్రశ్నించింది. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి హోదాలో యూపీ తూర్పు  ప్రాంతానికి ఇన్ ఛార్జిగా ఈ ఏడాది జనవరిలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన   విషయం తెలిసిందే.

Read Also : పట్టపగలే లక్షలు లూటీ: ఏటీఎం క్యాష్ వెహిక‌ల్‌పై కాల్పులు
Read Also : డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది