IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....

Rains
IMD Issues Yellow Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ముంబయి, గుజరాత్, ఢిల్లీ, ఎన్సీఆర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. (Mumbai Predicts Light Rains)
Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ ప్రారంభం
మహారాష్ట్రలోని మరఠ్వాడా రీజియన్, ముంబయి, పూణే నగరాల్లో ఈ నెల 23, 26 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. (Weather Update) ముంబయి, థానే, పూణే, రత్నగిరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల్లో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. (IMD Issues Yellow Alert) కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి, కోజికోడ్, కొట్టాయం, తిరువనంతపురం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రంలోనూ వచ్చే 24 గంటల్లో భారీవర్షాలు కురుస్తాయి.
బరోడా, సూరత్, నవసారి, వల్సాద్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో శనివారం భారవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నోయిడా, ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో రాగల ఐదురోజులపాటు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు శనివారం విడుదల చేసిన వెదర్ అప్ డేట్ బులెటిన్ లో తెలిపారు.