Jalpaiguri MP : బెంగాల్ బీజేపీ ఎంపీపై దాడి

ప‌శ్చిమ బెంగాల్‌ లో బీజేపీ ఎంపీపై దాడి జ‌రిగింది.

Jalpaiguri MP :  బెంగాల్ బీజేపీ ఎంపీపై దాడి

Bengal Mp

Updated On : June 11, 2021 / 9:45 PM IST

Jalpaiguri MP ప‌శ్చిమ బెంగాల్‌ లో బీజేపీ ఎంపీపై దాడి జ‌రిగింది. బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో..ఇంటి నుండి పారిపోయిన బీజేపీ కార్యకర్తలను ఇంటికి తిరిగి వెళ్ళమని ధైర్యం చెప్పేందుకు జల్పాయ్​గురి ఎంపీ జయంత కుమార్ రాయ్ ఇవాళ సిలిగురి వెళ్ళాడు. అక్కడి బీజేపీ కార్యకర్తల సహాయ శిబిరాన్ని ఆయన సందర్శించారు.

సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం తన కారులో తిరిగి వెళ్లే సమయంలో టీఎంసీ కార్యకర్తలు త‌న‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆజయంత కుమార్ రాయ్ ఆరోపించారు. తన తల,చేతులపై కొట్టారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో చట్ట నియమం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తనతో పాటు ఉన్న మరికొందిరిపైనా దాడి జరిగిందిని జయంత్ కుమార్ తెలిపారు.

ప్రస్తుతం ఎంపీ జయంత కుమార్.. సిలిగురిలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. జ‌యంత కుమార్ రాయ్ తల, పొత్తికడుపుపై దెబ్బలు త‌గిలాయ‌ని,ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్ స‌ర్జ‌రీ హెడ్ డాక్టర్ ఎ.ఎన్. సర్కార్ తెలిపారు.