కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నది ఏంటి, హరియాణా ఫలితాలు ఏం సూచిస్తున్నాయి?

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తోందా? మిత్రపక్షాల ఆగ్రహానికి కారణం అవుతోందా?

కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నది ఏంటి, హరియాణా ఫలితాలు ఏం సూచిస్తున్నాయి?

Congress (Photo Credit : Google)

Updated On : October 10, 2024 / 6:38 PM IST

Congress : రెండు జీవుల మధ్య సావాసం ఏర్పడినప్పుడు అందులో ఒకటి రెండో దానికి నష్టం చేస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది. ఇలా లాభం పొందేదే పరాన్నజీవి. కాంగ్రెస్ అలాంటిదేనని బీజేపీ ఓ ఆటాడుకుంటోంది. నిజంగా కాంగ్రెస్ తీరు అలాగే ఉందా? గెలిచే చోట ఒక్కరని, గెలవలేని చోట మనం అన్నట్లుగా తీరు మారిందా? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? అన్నట్లుగా తయారైందా? ఇదే హస్తం పార్టీని దెబ్బతీస్తోందా. హరియాణా ఫలితాల తర్వాత మొదలైన చర్చ ఏంటి..

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తోందా?
వరుసగా రెండు ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదాను సాధించింది. భవిష్యత్తుపై నేతల్లో కొత్త ఆశలు పుట్టించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తోందా? మిత్రపక్షాల ఆగ్రహానికి కారణం అవుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీని డైరెక్ట్ గా ఢీకొట్టడంలో విఫలమవుతున్న కాంగ్రెస్.. ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?

కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..
హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ టార్గెట్ గా ప్రధాని మోదీ ఘాటు విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల లెక్కలు కూడా తేల్చారు. కాంగ్రెస్ సాధించిన 99 సీట్లలో సగం వరకు మిత్రపక్షాల బలంతోనే వచ్చాయన్నారు. అయితే, కాంగ్రెస్ పై మిత్రపక్షాలు ఆధారపడిన రాష్ట్రాల్లో మాత్రం వారు మునిగిపోయారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ తన సొంత మిత్రులనూ మింగేస్తోంది. గెలుపు కోసమే పొత్తు అంటుంది. సొంతంగా ఒంటరిగా గెలిచేలా ఉంటే మాత్రం తనకు ఎవరూ వద్దంటుంది.. అదీ కాంగ్రెస్ నైజం అంటూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ.

Congress Future (Photo Credit : Google)

కాంగ్రెస్ అహంకారమే ఈ పరిస్థితికి కారణమంటూ ఆగ్రహం..
ఇప్పుడు హర్యానా ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల్లోనూ ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అహంకారమే ఈ పరిస్థితికి కారణం అంటూ శివసేన(యూబీటీ) బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. దీంతో కాంగ్రెస్ మారాల్సిన సమయం వచ్చింది. ఓవైపు బీజేపీని డైరెక్ట్ గా ఢీకొట్టలేక ఇబ్బందులు. ఇలాంటి సమయంలో మిత్రపక్షాలనూ దూరం చేసుకుంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది 34 పార్టీలో ఏర్పాటైన ఇండి కూటమి అనేక రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసినప్పటికీ.. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బీజేపీని ఢీకొట్టింది. దక్షిణాదిన కర్నాటకలో మాత్రమే నేరుగా బీజేపీతో తలపడగా.. మిగతా రాష్ట్రాల్లో స్థానిక, ప్రాంతీయ పార్టీలు, కూటములతో తలపడింది. కర్నాటకలో బీజేపీ మీద, తెలంగాణలో బీఆర్ఎస్ మీద మెరుగైన ఫలితాలు సాధించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లో స్థానికంగా బలంగా ఉన్న మిత్రపక్ష ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వచ్చింది. బెంగాల్ లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినా.. ఆ రాష్ట్రంలో ప్రధాన పోరు టీఎంసీ, బీజేపీ మధ్యనే సాగింది. ఢిల్లీలో ఆప్ తో జట్టు కట్టినా.. ఆ స్నేహం పంజాబ్ లో అమలు కాలేదు. కొన్ని చోట్ల ఈ కూటములు, పొత్తులు ఫలించి కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడంలో కీలకమయ్యాయి.

 

Also Read : రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడు ఎవరు.. ఆ ముగ్గురిలో రేసులో ముందుంది ఎవరంటే..