మిషన్ శక్తి ఏంటీ.. అంతరిక్షంలో సూపర్ పవర్ ఎలా అయ్యింది

భారత్ మరో అద్భుత ఘనత సాధించింది. అంతరిక్ష యుద్ధం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్ష రంగంలో మహా శక్తిగా అవతరించింది. భారత్ కు చెందిన లొకేషన్లపై విదేశాలకు చెందిన ఉపగ్రహాలు గూఢచర్యం చేస్తే.. వాటిని పేల్చేసే టెక్నాలజీని సాధించింది. లో-ఆర్బిట్ శాటిలైట్ ను A-SAT మిస్సైల్ ద్వారా కూల్చివేశామని, మిషన్ శక్తి విజయవంతం అయిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గర్వంగా ప్రకటించారు. వరల్డ్ స్పేస్ పవర్ గా భారత్ అవతరించిందని చెప్పటం ద్వారా ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు. ప్రపంచంలో ఈ సత్తా సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించటాన్ని గొప్పగా కీర్తించారు. అమెరికా, రష్యా, చైనా ఇదివరకు ఈ ఘనత సాధించాయి. భారత శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామన్నారు. ఇంతకీ స్పేస్ లో భారత్ సూపర్ పవర్ ఎలా అయ్యింది.. మిషన్ శక్తితో లాభాలేంటి.. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ఘనత ఏంటి..
Read Also : అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం : మోడీ సంచలన ప్రకటన
మిషన్ శక్తి ఏంటీ!
మన ఇస్రో శాస్త్రవేత్తలు లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని కూల్చేశారు. భూమికి 300 కిలోమీట్లర ఎత్తులో పేల్చివేశారు. యాంటీ శాటిలైట్ (A SAT) మిస్సైల్ ద్వారా ఎల్ఈవో(లోయర్ ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాన్ని నేలకూల్చారు. కేవలం 3 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది. ముందుగా ఓ లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత మిసైల్స్ ద్వారా దాన్ని కూల్చేశారు. భవిష్యత్ తో శాటిలైట్ల ద్వారా జరిగే దాడులను, గూఢచర్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారు DRDO శాస్త్రవేత్తలు. అంతరిక్షంలోని శాటిలైట్లను కూల్చివేయగల సామర్ధ్యం ఉన్న మిస్సైల్స్ ను తయారు చేయటం భారత్ ఘనత.
300 కిలోమీటర్ల ఎత్తులో.. అంతరిక్షం లక్ష్యాలను కూడా ఛేదించగల మిస్సైల్స్ ను తయారు చేయటం DRDO సాధించిన అద్బుతం. దేశంపై నిఘా పెట్టే శాటిలైట్లను కూల్చివేయటానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. శత్రుదేశాలు అంతరిక్ష యుద్ధానికి దిగితే.. సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఇదే చేసింది భారత్. ASAT టెక్నాలజీని ఉపయోగించిన తొలి దేశం అమెరికా. 1958లోనే అమెరికా ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత 1964లో రష్యా, 2007లో చైనా ఈ ఘనత సాధించాయి.
* భారత్ ఖాతాలో తొలి యాంటీ శాటిలైట్ వెపన్
* యాంటీ శాటిలైట్.. దీన్నే కైనటిక్ స్టిల్ వెపన్ అంటారు.
* కేవలం ఢీకొట్టడంతోనే శత్రు శాటిలైట్‌ను పేల్చేస్తారు.
* దీని కోసం ప్రత్యేక వార్‌హెడ్లను వాడరు.
* పొజిషన్‌లో టార్గెట్‌ను ఫిక్స్ చేస్తేనే, అంత తక్కువ సమయంలో శత్రు శాటిలైట్‌ను పేల్చే అవకాశాలు ఉంటాయి
* ఓ శాటిలైట్‌ను పేల్చే పరీక్షను భారత్ నిర్వహించడం ఇదే మొదటిసారి.
* అంతరిక్ష ఆయుధాలు భవిష్యత్తులో ఎక్కువగా వాడే అవకాశం
* దాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ శక్తి ప్రయోగం
* అంతరిక్ష యుద్ధం కోసం భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతం పంపిన భారత్
* 2012 నుంచే అందుబాటులో యాంటీ శాటిలైట్లు
* ఇప్పటి వరకు శత్రు దేశాల శాటిలైట్లను పేల్చే సత్తా కేవలం అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది.
Read Also : బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్