MP Urination Case: ఆందోళనలో మూత్ర బాధితుడు.. కాళ్లు కడిగి సన్మానం చేశారు సరే, రేపటి భద్రత సంగతేంటి?

సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను కాదని చెప్పాను. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు.

MP Urination Case: ఆందోళనలో మూత్ర బాధితుడు.. కాళ్లు కడిగి సన్మానం చేశారు సరే, రేపటి భద్రత సంగతేంటి?

Madhya Pradesh: ‘‘ఈరోజు ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. గౌరవించింది. అందరూ మా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఎన్నో రోజులు ఉండదు. నాలుగు రోజుల తర్వాత ఎప్పటిలాగే అయిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? భవిష్యత్ గురించి నాకు భయంగా ఉంది’’ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో మూత్రదాడికి గురైన దశ్మత్ రావత్(35) అనే గిరిజన వ్యక్తి వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇది. నిజమే.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తన ఇంటికి పిలిపించి కాళ్లు కడిగి, సన్మానం చేసి, కలిసి భోజనం చేయడంతో దేశమంతా చర్చించుకుంది. అంతకు ముందు జరిగిన అవమానికి ఇది న్యాయమని కీర్తించినవారు లేకపోలేదు.

MLA Ketireddy Peddareddy : పరిగెత్తించి కొడ్తా..! జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అయితే బాధితుడు చెప్పినట్లుగా.. దశ్మంత్ గురించి ఇంకో నాలుగు రోజుల చర్చ ఉంటుంది. బహుశా ఆ నాలుగు రోజులు అతడు చిన్నపాటి సెలబ్రెటినే. కానీ ఆ తర్వాత అతడి పరిస్థితి ఏంటి? ఇప్పుడంటే అతడి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వెంట వస్తున్నారు. కానీ ఆ తర్వాత? అతడు తిరిగి తన పాత జీవితంలోకి వెళ్తాడు. సర్వసాధారణ నిరుపేదలు, నిస్సహాయుల మధ్యే మళ్లీ జీవితాన్ని కొనసాగించాలి. ఇంతకు ముందు జరిగిన దాడులు మళ్లీ పునరావృతం కావని చెప్పగలమా?

దశ్మంత్ మాట్లాడుతుంటే తన గొంతు భయంతో వణికిపోవడం చూడవచ్చు. మూత్ర దాడి జరిగినప్పుడు కూడా దశ్మంత్.. నిశ్చేష్టుడై ఉండిపోయాడు తప్ప, కనీసం అక్కడి నుంచి పారిపోలేని నిస్సహాయుడు. దీనికి మన సమాజంలో నివురుగప్పిన కుల ఆధిపత్యం. బాధితుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. పర్వేష్ శుక్లా, ఆదర్శ్ శుక్లా, నారాయణ్ సాహూ అనే ముగ్గురు ఆరోజు రాత్రి 10 గంటలకు దశ్మంత్ దగ్గరకు వచ్చారు. పర్వేష్ శుక్లా సిగరెట్ తాగుతూ దశ్మంత్ మీద మూత్రం పోస్తుంటే నారాయణ్ సాహూ వీడియో రికార్డ్ చేశారు.

Bengal Panchayat Polls: పోలింగ్ కంటే ముందు మొదలైన ఫైటింగ్.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కార్యకర్తలతో ఘర్షణలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి

వాస్తవానికి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మొదట ఇది ఎవరో చేశారో చెప్పలేదు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చివరికి పర్వేష్ తనేనని ఒప్పుకున్నాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. బాధితుడు దశ్మంత్ ఈ ఘటన గురించి మొదట పెదవి విప్పలేదు. పైగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పాడు. కానీ నిందితుడు నిజం ఒప్పుకున్న అనంతరం తననేని పోలీసుల ముందు అంగీకరించాడు. కారణం కులమేనని నర్మగర్భంగా ఒప్పుకున్నాడు.

‘‘అతడు ఉన్నపళంగా వచ్చి నాపై మూత్రం చేయడం ప్రారంభించాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు జరుగుతుందో తెలియదు. అయితే నేను దీనిపై ఫిర్యాదు చేయాలని అనుకోలేదు. జరిగిందేదో జరిగిందని అనుకున్నాను. అతడు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. అతడు ఏం చేసినా మౌనంగా అంగీకరించడం తప్ప అందుకే నేను ఏమీ అనలేదు’’ అని చెప్పాడు.

Uniform Civil Code Draft : ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి యూనిఫాం సివిల్ కోడ్ డ్రాఫ్ట్

నిజానికి ఈ వీడియో వైరల్ అయిన రోజుకు పది రోజుల ముందు జరిగిన ఘటననట. ‘‘సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను వాటిని కొట్టిపారేశాను. నేను కాదని చెప్పాను. పర్వేశ్‭ది కుబ్రీ గ్రామం, నాది కరౌది గ్రామం. మార్కెట్ కోసం తరుచూ కుబ్రీ గ్రామం వెళ్లాలి. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు. కనీసం నా కుటుంబానికి కూడా చెప్పలేదు’’ అని బాధితుడు అన్నాడు.

‘‘సీఎం నన్ను కలుస్తనని అన్నాడని పోలీసులు చెప్పి నన్ను తీసుకెళ్తున్నప్పుడు నా కుటుంబం ఆందోళనకు గురైంది. ఎందుకంటే.. జరిగిన దారుణం గురించి వారికి తెలియదు. ఇంత జరిగాక నా భార్య, పిల్లలు, ఇతర కుటుంబీకుల గురించి భయవేస్తోంది. మరో రెండ్రోజులు అయితే పోలీసులు ఉండరు. మాపై మళ్లీ ఏమైనా జరగొచ్చు. మాకు భద్రత కావాలని అందరూ అడుగుతున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను’’ అని తీవ్ర భయంతో చెప్పాడు బాధితుడు దశ్మంత్.

Rahul Gandhi: పొద్దుపొద్దున్నే పొలంలో కనిపించిన రాహుల్ గాంధీ

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పిన అనంతరం.. బాధితుడి పరిహారంపై సిద్ధి జిల్లా కలెక్టర్ సాకేత్ మాల్వియాకు అప్పగించారు. ఆ మర్నాడు జిల్లా ఎస్పీ రవీంద్ర వర్మతో కలిసి బాధితుడి గ్రామానికి వచ్చిన కలెక్టర్.. 5 లక్షల రూపాయల పరిహారం (చెక్), ఇళ్లు చక్కదిద్దుకోవడానికి 1.5 లక్షల రూపాయలు (చెక్) అందించారు.