White Honey : వైట్ హనీ..యాంటీఆక్సిడెంట్ల గని..
తేనె అంటే గోధుమ రంగులో తియ్యగా ఉంటుంది. కానీ తేనెల్లో కూడా పలు రకాలు..రంగులు ఉన్నాయని చాలామందికి తెలియదు. తేనె శరీరానికి ఎంతోమంచిది అని నిపుణులు చెబుతుంటారు. కానీ తేనె అంటూ గోధుమ రంగులో ఉండేదే అని అనుకుంటాం. కానీ ‘వైట్ హనీ’ (తెల్ల తేనె) గురించి తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరంటున్నారు పోషకాహార నిపుణులు. కానీ వైద్యుల సలహాలతో వాడితే తెల్ల తేనెతో ఎన్నో ఉపయోగాలంటున్నారు.

White Honey (1)
White Honey Benifits : తేనె అంటే గోధుమ రంగులో తియ్యగా ఉంటుంది. కానీ తేనెల్లో కూడా పలు రకాలు..రంగులు ఉన్నాయని చాలామందికి తెలియదు. తేనె శరీరానికి ఎంతోమంచిది అని నిపుణులు చెబుతుంటారు. కానీ తేనె అంటూ గోధుమ రంగులో ఉండేదే అని అనుకుంటాం. కానీ ‘వైట్ హనీ’ (తెల్ల తేనె) గురించి తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ తెల్లతేనెలో మనిషికి చాలా ప్రయోజనాలిస్తుందంటున్నారు. గోధుమ రంగు తేనె కంటే ఎక్కువ పోషకాలు కలిగినదిగా పేర్కొంటున్నారు. తెల్ల తేనె వలన కలిగే లాభాల గురించి నష్టాల గురించి కూడా తెలుసుకుందాం..ఎందుకంటే ఏదైనా నిపుణుల సలహాతో వాడితేనే మంచిది.
‘తెల్ల తేనె’ను ముడి తేనె అని కూడా అంటారు. తెల్ల తేనె అల్ఫాల్ఫా, ఫైర్‌వీడ్, వైట్ క్లోవర్ పువ్వుల నుంచి తీస్తారు. రోజూ ఒక టీస్పూన్ వైట్ తేనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.వైట్ హనీలో విటమిన్ ఏ, బీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటి అనేక పోషకాలనున్నాయి. అందుకే తెల్ల తేనెను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ అని అంటారు. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ అని పిలువబడే సమ్మేళనాలు కూడా ఉన్నాయి దీంట్లో.అలాగే వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా సహాయం పడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
దగ్గు సమస్యకు తెల్ల తేనె చాలా మంచిది. నిమ్మకాయ, తెల్ల తేనె గోరువెచ్చని నీటిలో వేసి తాగితే చక్కటి ఉపశమనం పొందొచ్చు.అల్సర్ సమస్యకు తెల్లహనీ చాలా మంచిది. జీర్ణవ్యవస్థను సరిచేయడంలో తెల్లహనీ చాలా కీలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక చెంచా తెల్ల తేనె తీసుకుంటే చాలా మంచిది.నోటిలో పుండ్లు ఉంటే.. ముడి తేనెను తీసుకుని వాటిపై అప్లై చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. తెల్ల తేనెను ప్రతిరోజూ ఒక్క స్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే, శరీరంలో హిమోగ్లోబిన్ కంటెంటె అత్యంత వేగంగా పెరుగుతుంది. మహిళలు రక్తహీనత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం.ముడి తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫంగస్‌ను తొలగించే లక్షణాలు తెల్ల తేనెలో పుష్కలంగా ఉన్నాయి.
ముడి తేనె వల్ల నష్టాలు కూడా లేకూపోలేదు..
ముడి తేనెలో అనేక గుణాలు ఉన్నాయి మాట నిజమే కాదు. డాక్టర్ సలహాలతో దీన్ని వాడాలని చెబుతున్నారు నిపుణులు. తెల్లతేనె ఎంత డోసులో తీసుకోవాలి? ఏఏ సమయాల్లో ఎంతెంత తీసుకోవాలి? ఏఏ సమస్యలను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి?వంటి విషయాలు డాక్టర్ల నుంచి తెలుసుకుంటూ ఎటువంటి భయాలు లేకుండా వాడుకోవచ్చు. వాస్తవానికి, దాని సూక్ష్మజీవుల కారణంగా తెల్ల తేనె కొన్నిసార్లు బొటూలిజానికి కారణమవుతుంది. బోటులిజం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా రెట్లు ఎక్కువవుతుందట.
అంతేకాదు తెల్ల తేనెను ఎక్కువగా తీసుకుంటే కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపడుతుంది. ముడి తేనెను అధికంగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు కూడా ముడి తేనెను తీసుకోకూడదు.