White Python : కర్నాటకలో తెల్ల కొండచిలువ ప్రత్యక్షం

కర్నాటకలో అరుదైన కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్‌ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్‌ అనే వ్యక్తి ఇంట్లో తెల్లని కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువ కన్నా భిన్నంగా ఉన్న తెల్లని రంగులో ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు అయోమయానికి గురయ్యారు.

White Python : కర్నాటకలో తెల్ల కొండచిలువ ప్రత్యక్షం

White Python

Updated On : August 24, 2022 / 8:30 PM IST

White python : కర్నాటకలో అరుదైన కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్‌ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్‌ అనే వ్యక్తి ఇంట్లో తెల్లని కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువ కన్నా భిన్నంగా ఉన్న తెల్లని రంగులో ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు అయోమయానికి గురయ్యారు.

సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ పవన్‌ నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. తెల్లని కొండ చిలువ అని నిర్ధారించారు. మెలనిన్‌ లోపం కారణంగా పాము చర్మం తెల్లగా మారుతుందని.. దీన్ని ‘అల్బినో స్నేక్‌’గా పిలుస్తారని పవన్‌ నాయక్‌ తెలిపారు.

Viral Video : అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భుజాలపై ఎలా మోసుకెళ్తున్నాడో చూడండి.. వీడియో!

కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఇదిలా ఉండగా.. ఇంతకుముందు కర్నాకట శివమొగ్గ జిల్లాలో రెండుసార్లు శ్వేతనాగు కనిపించింది.