Video: సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?

వారిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Video: సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?

Updated On : October 4, 2024 / 6:13 PM IST

మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు ఇవాళ ముంబైలోని సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకారు. అక్కడ కట్టిన వలపై వారంతా పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఒక వర్గాన్ని చేర్చడాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ ఘటనకు పాల్పడ్డారు. సచివాలయ భవనం పై నుంచి దూకి ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ఆ వలను 2018లో ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతనే నరహరి జిర్వాల్.

ఆయనతో పాటు ముగ్గురు శాసనసభ్యులు కలిసి ధన్‌గర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. వారిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం కూడా కొందరు గిరిజన ఎమ్మెల్యేలు సచివాలయ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా వారు నిరసన తెలపడం గమనార్హం.

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు- టీటీడీ